Share News

TG: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ అరెస్ట్‌

ABN , Publish Date - May 02 , 2024 | 05:35 AM

సోషల్‌ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

TG: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ అరెస్ట్‌

  • పంతంగి టోల్‌గేట్‌ వద్ద అదుపులోకి

  • ఓయూ పోలీ్‌సస్టేషన్‌కు తరలింపు

  • క్రిశాంక్‌ వైరల్‌ చేసిన నోటీసు నకిలీదే

  • ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ వెల్లడి

  • బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ/తార్నాక/చౌటుప్పల్‌ రూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా పంతంగి టోల్‌గేట్‌ వద్ద క్రిశాంక్‌ వాహనాన్ని పోలీసులు ఆపారు.


అనంతరం ఆయన్ను అరెస్టు చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీరు, కరెంట్‌ సమస్యలపై నకిలీ నోటీసులు సృష్టించి వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఓయూ చీఫ్‌ వార్డెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిశాంక్‌పై ఓయూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని జడ్జి ముందు హాజరు పరిచారు.


క్రిశాంక్‌కు న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండు విధించారు. దీంతో క్రిశాంక్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, తమ పార్టీ యువనేత, ఉద్యమకారుడు క్రిశాంక్‌ను అరెస్టు చేయడం అక్రమమని, గల్లీ కాంగ్రెస్‌ వైఫల్యాలు, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ బుధవారం పేర్కొన్నారు. కాంగ్రె్‌స-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని, తెలంగాణ ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు. ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీని చూస్తున్నామని, ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్‌, బీజేపీలకు పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 05:35 AM