Share News

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:57 PM

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మంగళవారం యాద వ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ ఆధ్వర్యంలో మందమర్రిలోని వివిధ గ్రా మాలకు చెందిన యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 30 : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మంగళవారం యాద వ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ ఆధ్వర్యంలో మందమర్రిలోని వివిధ గ్రా మాలకు చెందిన యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 14 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీవివేక్‌ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలన్నారు. బీజేపీ, బీ ఆర్‌ఎస్‌ పార్టీల మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేమనపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్య ర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించా లని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ కోరారు. నీల్వాయి, గొర్లపల్లి, వేమనపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి వంశీకృష్ణతో కలిసి ప్రచారం నిర్వహిం చారు. ప్రజలు, ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల సంక్షేమం సాద్యమ వుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలు వురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు అన్ని పార్టీల నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్‌ దామెర శ్రీను, పోతురాజుల లీల, పలువురు కాంగ్రెస్‌లో చేరా రు. కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వ హించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీని గెలిపించాలని ప్రజలను కోరారు. పట్టణాధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య,మున్సిపల్‌ చైర్మన్‌ జక్కుల శ్వేత, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఏసీసీ: పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జేఏసీ కోకన్వీనర్‌ కొంగల ప్రజ్యోత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా పాలిం చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని తెలిపారు. వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:57 PM