Share News

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:54 PM

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్స హించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్‌లో హాజీపూర్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్ప త్తుల మేళాను ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానందలతో కలిసి ప్రారం భించారు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక

ఏసీసీ, ఏప్రిల్‌ 30: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్స హించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్‌లో హాజీపూర్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్ప త్తుల మేళాను ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానందలతో కలిసి ప్రారం భించారు. మంత్రి మాట్లాడుతూ సేంద్రి య వ్యవసాయానికి చేయూతనివ్వడం వల్ల రైతులకు తోడ్పాటుతోపాటు ప్రజ లు ఆరోగ్యంగా ఉంటారన్నారు. త్వర లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు లతో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. రైతులు పంట మార్పిడి విధానం అవ లంభించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగు తుందన్నారు. ఇక్కడే కూరగాయలు, పప్పు దినుసులు పండించాలన్నారు. గోనె శ్యాంసుందర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ ఉప్పలయ్య, జడ్పీటీసీ శిల్పశ్రీనివాసరావు,వైస్‌ చైర్మన్‌ వేణు, బొడ్డు శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:54 PM