Share News

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:59 PM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బం దికి పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 30: పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బం దికి పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆర్డీవో రాములుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సం బంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని, అధికా రులకు అందించిన హ్యాండ్‌బుక్‌ను చదివి అవగాహన పెంచు కోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ జరిగే 90 నిమిషాల ముందు ఇద్దరు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని, పోలింగ్‌ ఏజెంట్లు లేనిపక్షంలో ప్రిసైడింగ్‌ అధికారికి సమాచా రం అందించి మాక్‌పోల్‌ ప్రారంభించాలన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల నిర్వహణపై ఏమైనా అనుమానాలు ఉంటే మాస్టర్‌ట్రైనర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు.

సూక్ష్మ పరిశీలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

సూక్ష్మ పరిశీలకులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవ హరించాలని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్‌ గుప్తా పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీ రామగుండంలోని ఈడీసీ మిలినీయం హాలులో సూక్ష్మ పరిశీకులకు ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి హాజరయ్యారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడు తూ మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సమిష్టిగా కృషి చేయాల న్నారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక బృందాలతో పాటు అవసరమైన పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని నియమించి ఎన్నికల ప్రవర్తన నియమవాళిపై నిరంతరం పర్యవేక్షించాల న్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:59 PM