Share News

Kumaram Bheem Asifabad: ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

ABN , Publish Date - May 01 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌, మే 1: జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరి చిన గోదాంను రాజ కీయ పార్టీల నాయ కుల సమక్షంలో బుధ వారం జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు.

Kumaram Bheem Asifabad: ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

ఆసిఫాబాద్‌, మే 1: జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరి చిన గోదాంను రాజ కీయ పార్టీల నాయ కుల సమక్షంలో బుధ వారం జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్ని కలకు వందచొప్పున బ్యాలెటింగ్‌యూనిట్లు, కంట్రోలింగ్‌ యూనిట్లు, వీవీప్యాట్‌ అవసరం ఉన్నందున గోదాంలో భద్ర పరిచిన ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మొదటివిడత పరిశీలన కార్యక్రమం పూర్తిచేసి పార్లమెంట్‌ ఎన్నికలలో ఉప యోగిస్తున్నామని తెలిపారు. గోదాంలో ఉన్న సీసీటీవీల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్య క్రమంలో ఎన్నికల సూప రింటెండెంట్‌ మధుకర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ జితేం దర్‌, రాజకీయపార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బకు గురైన వారు పాటించాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధి కారులకు సూచించారు. వడదెబ్బ బాధితులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈనెల 6వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటకురావద్దని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు, టోపీ లు,కళ్లజోళ్లు ధరించాలని, నీటిశాతం అధికంగా ఉండేపండ్లు తీసుకోవాలన్నారు.

Updated Date - May 01 , 2024 | 10:49 PM