Share News

Kumaram Bheem Asifabad: సెక్టార్‌ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:55 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 29: లోక్‌సభ ఎన్నికలు-2024లో సెక్టార్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లాఎన్నికల అధి కారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad:  సెక్టార్‌ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలి

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 29: లోక్‌సభ ఎన్నికలు-2024లో సెక్టార్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లాఎన్నికల అధి కారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలె క్టర్లు దీపక్‌ తివారి, దాసరి వేణు, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్‌రావు, ఆర్డీ వో సురేష్‌తో కలిసి సెక్టార్‌ అధికారులు, తహసీల్దార్‌లు, మండల పరిషత్‌ అభి వృద్ధి అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలోని ప్రతిపోలింగ్‌ కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో వసతులపై పర్యవేక్షించాలని, తాగునీరు, ఫ్యాన్లు, తదితరాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌యంత్రాల కమీషన్‌ కార్యక్రమంలో సెక్టార్‌అధికారులు విధులు నిర్వ హించాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి, రెండో ఈవీఎం ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తైందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంల కమీషన్‌ కార్యక్ర మంలో సెక్టార్‌ అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించి ప్రతి ఈవీ ఎం పనితీరును పరీక్షించాలని తెలిపారు. ఓటరు స్లిప్పులు ఓటర్లకు అందజేసే విధంగా చూడాలని, షాడో పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన వసతులపై సంబంధిత అధికారులు వసతులు కల్పించే విధంగా చూడాలని తెలిపారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఫర్నీచర్‌ సరిపడా ఉండాలన్నారు. సెక్టార్‌ అధికారులు ఎన్నికల అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

వేసవికాలం పూర్తయ్యే వరకు తాగునీటి సరఫరాకు చర్యలు

ఆసిఫాబాద్‌: వేసవి కాలంపూర్తయ్యే వరకు ప్రతిఇంటికి నిరంతర తాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ విభా గం అధికారులు, ఇతర అధికారులతో వేసవిదృష్ట్యా తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవికాలం పూర్తయ్యేవరకు ప్రతిఇంటికి నిరంతరాయంగా తాగునీటి నీటిసర ఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మారుమూలగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. సమావేశంలో గ్రామీణ నీటిపారుదలశాఖ ఈఈ వెంకట పతి, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

రెబ్బెన: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తిచేసే విధం గా అధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ, ఎడవెల్లిలోని అమ్మఆదర్శ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుదీకరణ, తాగునీరు, మూత్రశాలలు, సచివాలయాలు, అదనపుతరగతి గదులు మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసవసతులు ఉండేట్టు చూసుకోవాలన్నారు. మే13 జరుగనున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ రోజున పోలింగ్‌కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, విద్యుత్‌సరఫరా, నీడ, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడుతూ ఎన్నికల శాతం పెంచాలన్నారు. ప్రతిఒక్క ఓటరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విధులపట్ల సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:55 PM