Share News

Kumaram Bheem Asifabad: ఎన్నికలపై పోలీసు అబ్జర్వర్‌ సమీక్షా సమావేశం

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:53 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 29: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీసు అబ్జ ర్వర్‌ రాజేష్‌కుమార్‌ సక్సెనాకు సోమవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Kumaram Bheem Asifabad: ఎన్నికలపై పోలీసు అబ్జర్వర్‌ సమీక్షా సమావేశం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 29: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీసు అబ్జ ర్వర్‌ రాజేష్‌కుమార్‌ సక్సెనాకు సోమవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాపోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అబ్జర్వర్‌ సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు రోజు, ఎన్నికలరోజు, స్ట్రాంగ్‌రూంకేంద్రం వద్ద బందోబస్తు, భద్రతఏర్పాట్లకు సంబం ధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలను ఎస్పీ ఆయనకు వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ట్రబుల్‌ మాంగ ర్స్‌ను బైండోవర్‌, రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్‌ చేశామన్నారు. మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వ హించి ప్రజలకు భరోసా కల్పించామన్నారు. అనంతరం ఇంటర్‌ డిస్ట్రిక్‌ బార్డర్‌ చెక్‌పోస్టును అబ్జర్వర్‌ తనిఖీ చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 10:53 PM