Share News

Kumaram Bheem Asifabad: అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:49 PM

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 29: పార్లమెంట్‌ ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్‌ ప్రక్రియ ముగిసి ఎన్నికల ప్రచార కార్యక్ర మాలు ప్రారంభమవుతున్నవేళ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చుల పరిశీల కుడు వివేకానంద రాజేంద్ర జదావర్‌ అన్నా రు.

Kumaram Bheem Asifabad:  అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి

- ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వివేకానంద్‌ రాజేందర్‌ జదావర్‌

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 29: పార్లమెంట్‌ ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్‌ ప్రక్రియ ముగిసి ఎన్నికల ప్రచార కార్యక్ర మాలు ప్రారంభమవుతున్నవేళ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చుల పరిశీల కుడు వివేకానంద రాజేంద్ర జదావర్‌ అన్నా రు. సోమవారం మండలంలోని వెంకట్రావు పేటలోని అంతర్‌జిల్లా చెక్‌పోస్టు, హుడ్కిలి అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులను జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్‌రావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివేకా నంద రాజేంద్ర జదా వర్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ ప్రక్రి య ముగిసి ప్రచార కార్య క్రమాలు ప్రారం భమవుతున్న నేపథ్యం లో ఎన్నికల అధికా రులు మరింత అప్ర మత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఆదిలాబాద్‌(ఎస్టీ) పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని సిర్పూర్‌(001), ఆసిఫా బాద్‌(005) నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వ హణకు ఫ్లయింగ్‌, స్టాటిస్టికల్‌, వీడియో సర్వే యలెన్స్‌ బృందాలు వీడియోపరశీలన తది తర సిబ్బందిని నియమించి పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తామన్నారు. బ్యాంకు మొత్తంలో జరిగే లావాదేవీలపై బ్యాంకుఅధికారులు ఎప్పటికప్పుడు పైఅధి కారులకు సమాచారం అందించాలన్నారు. ఆదా యపన్నుశాఖ అధికారులు బ్యాంకుల్లో జరిగే పదిలక్షల లావాదేవీలపైనిఘా పెట్టాల న్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిం చకుండా కేటాయించిన విధులను బాధ్యత యుతంగా నిర్వర్తించాలన్నారు. విధినిర్వ హణలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయి తే వెంటనే పైఅధికారుల దృష్టికితీసుకు రావాలన్నారు. జిల్లాలోఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు.

కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం..

ఆసిఫాబాద్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చుల పరిశీలకుఛిు వివేకానంద రాజేంద్ర జదావర్‌ సోమవారం పోలీసు పరి శీలకుడు రాజేష్‌కుమార్‌ సక్సెనా, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసి మోడ ల్‌ అధికారులు, ఎన్నికల విభాగం అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నోడల్‌ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:49 PM