Share News

Kumaram Bheem Asifabad: కాంగ్రెస్‌ అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: గోడం నగేష్‌

ABN , Publish Date - May 01 , 2024 | 10:47 PM

కౌటాల, మే 1: అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీఅభ్యర్థి గోడం నగేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధ వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

Kumaram Bheem Asifabad:  కాంగ్రెస్‌ అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: గోడం నగేష్‌

కౌటాల, మే 1: అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీఅభ్యర్థి గోడం నగేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధ వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని మళ్లీ మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్రంలో గద్దెనెక్కిందన్నారు. బీజేపీ ఆధ్వ ర్యంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో తాను ఎంపీగా, మంత్రి గా రాష్ట్రంలో అభివృద్ధికి కృషిచేశానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాయమాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, సత్యనారాయణ, రాజేందర్‌గౌడ్‌, మిథున్‌, భీమన్న, రవి తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి: ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని గోడం నగేష్‌ అన్నారు. మండలంలోని రవీంద్రనగర్‌లో ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఆయన మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పే మాటలను నమ్మ కుండా దేశాభివృద్ధికి పాటుపడే బీజేపీని, తనను గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ ఎంపీ నగేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రామలక్ష్మణులలగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉదయం వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కాసేపు మాట్లాడి ఎన్నికల్లో తనను గెల్పించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పోచమ్మ బస్తీ, మార్కెట్‌ఏరియాలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో తనను తప్పకుండా గెల్పించాలన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలు కేంద్రం దృష్టికి పోవాలంటే బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ను అధిక మెజార్టీతో గెల్పించాలని పిలుపునిచ్చారు. వారివెంట అరుణ్‌లోయా, సిందం శ్రీనివాస్‌, దెబ్బటి శ్రీనివాస్‌, గజ్జల లక్ష్మణ్‌, వలుపదాసు రమేష్‌ ఉన్నారు.

Updated Date - May 01 , 2024 | 10:47 PM