Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా కార్మిక దినోత్సవం

ABN , Publish Date - May 01 , 2024 | 10:55 PM

ఆసిఫాబాద్‌, మే 1: ఐక్యఉద్యమాలతోనే హక్కులను సాధించుకోవచ్చని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. మేడే పురస్కరించుకుని బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో ఆయాకార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 Kumaram Bheem Asifabad: ఘనంగా కార్మిక దినోత్సవం

- ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలి

- మే డే సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు

ఆసిఫాబాద్‌, మే 1: ఐక్యఉద్యమాలతోనే హక్కులను సాధించుకోవచ్చని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. మేడే పురస్కరించుకుని బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో ఆయాకార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఆయా కార్యాలయాల్లో మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యఉద్యమాలతోనే హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శణ నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లాకార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు ఉపేందర్‌, సీఐటీయూ నాయకులు రాజు, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, దినకర్‌, కార్తీక్‌, లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో బుధవారం మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లాకార్యదర్శి కూశన్న రాజన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మిక శక్తిని అగణతొక్కాలని ప్రయత్నిస్తోందన్నారు. సీపీఎం సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ ముంజం ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కొల్పోయే దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి త్రివేణి, సీపీఎం నాయకులు కోట శ్రీనివాస్‌, పద్మ, అనిత, సాయికృష్ణ, మల్లన్న, శంకర్‌, సంజీవ్‌, శంకరమ్మ పాల్గొన్నారు. అలాగే ట్రాన్స్‌కో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులసంఘం(ఏఎన్‌టీయసీ)-327 ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎమ్మాజీ సతీష్‌ మాట్లాడుతూ కార్మికులహక్కుల కోసం ఐఎన్‌టీయూసీ పోరా టంలో ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, రామకృష్ణ, ప్రదీప్‌, శ్రీనివాస్‌, కుమారస్వామి, బుచ్చిబాబు, శకుంతల, తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడే దినోత్సవాన్ని సీఐటీయూ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు విలాస్‌, రవి, శ్యాంరావు, వెంకటి, ఆశావర్కర్లు అనురాధ, హంస, లక్ష్మి, అర్పణ, అంగన్‌వాడీవర్కర్‌ కళావతి, విమల, కమల తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండలకేంద్రంలోని బజార్‌ఏరియాలో మేడే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వజ్రమ్మ, జయప్రద, కల్పన, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, రాజ్‌కుమార్‌, అరుణ్‌గౌడ్‌, రవీందర్‌, మారుతి, మమత తదితరులు పాల్గొన్నారు.

కౌటాల: మండల కేంద్రంలో మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు నగేష్‌, మోరేశ్వర్‌, అనీల్‌, తిరుపతి, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలో బుధవారం భవన నిర్మాణ సంఘంతోపాటు హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, సుధాకర్‌, అశోక్‌, దీపక్‌, ప్రశాంత్‌, విజయ్‌, శ్యాంరావు, విలాస్‌, తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండల కేంద్రంలో బుధవారం మే డేను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లచ్చగౌడ్‌, మొగిలి గౌడ్‌, జంగు, సత్తయ్య, శంకర్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు కుటికెల శంకర్‌, సిడాం ధర్ము మాట్లాడుతూ కార్మికులకు రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన హక్కులు అమలు కావడం లేదని ఆరోపించారు. ఆదేవిధంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు వారు జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. గ్రామీణ పేదలసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు సంబాజీ, చాహకటి దేవరావ్‌, మారుతి, కమల తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో మే డేను కార్మికులు గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిలా కార్యదర్శి కుటికెల శంకర్‌ మాట్లాడుతూ కార్మికులకు కనీసవేతనం ఇవ్వాలన్నారు. అదేవిధంగా కార్మికు లకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు తమహక్కుల కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉంద న్నారు. కార్యక్రమంలో చాహకాటి సంబాజీ, టేకం దేవరావు, మారుతి, గంగాధర్‌ వివిధ గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 10:55 PM