Share News

పది ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:00 PM

పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయిగా సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు 20వ స్ధానం దక్కింది. జిల్లాలో బాలుర 4748, బాలికలు 4535 మొత్తం 9283 మంది పరీక్షకు హాజరు కాగా 8579 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 4338 మంది, బాలికలు 4242 మంది ఉన్నారు. బాలురలో ఉత్తీర్ణత 91.36 శాతం, బాలికల్లో ఉత్తీర్ణత 93.52 శాతం మొత్తం ఉత్తీర్ణత 92.42 శాతం ఉంది.

పది ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏసీసీ, ఏప్రిల్‌ 30: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయిగా సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు 20వ స్ధానం దక్కింది. జిల్లాలో బాలుర 4748, బాలికలు 4535 మొత్తం 9283 మంది పరీక్షకు హాజరు కాగా 8579 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 4338 మంది, బాలికలు 4242 మంది ఉన్నారు. బాలురలో ఉత్తీర్ణత 91.36 శాతం, బాలికల్లో ఉత్తీర్ణత 93.52 శాతం మొత్తం ఉత్తీర్ణత 92.42 శాతం ఉంది.

జిల్లాలో మూడు ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా 69 మంది పరీక్షకు హాజరు కాగా 66 మంది పాస్‌కాగా ఉత్తీర్ణత 95.65 శాతం. ప్రభుత్వ ఆశ్రమ హైస్కూళ్లు 13 ఉండగా 431 మందికిగాను 393 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణత 91.18 శాతం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 7 ఉం డగా 206 మంది పరీక్షకు హాజరు కాగా 160 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 77.67 శాతం. కేజీబీవీలు 18 ఉండగా 527 మంది పరీక్షకు హాజరు కాగా 483 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 91.66 శాతం. లోక ల్‌ బాడీ పాఠశాలలు 100 ఉండగా 2948 మంది పరీక్ష రాయగా 2532 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 85.89 శాతం. మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలు 7 ఉండగా 486 మంది పరీక్ష రాయగా 485 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణత 99.79 శాతం. ప్రైవేటు పాఠశాలలు 78 ఉండగా 3260 మంది పరీక్ష రాయగా 3139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 96.29 శాతం. మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మోడల్‌ స్కూల్‌లు 5 ఉండగా 469 మంది పరీక్ష రాయగా 443 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 94.46 శాతం. గురుకుల పాఠశాల ఒకటికిగాను 59 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 9 ఉండగా 677 మంది పరీక్ష రాయగా 668 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.67 శాతం ఉత్తీర్ణత. జిల్లాలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 188 మంది ఉన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 71 కాగా, లోకల్‌ బాడీ పాఠశాలలు 21, మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలు 5, ప్రైవేటు పాఠశాలలు 29, మైనార్టీ గురుకుల పాఠశాలలు 2, మోడల్‌ పాఠశాలలు 2, గురుకుల పాఠశాల 1, కేజీబీవీ 3, ఎయిడెడ్‌ పాఠశాల 1, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 4, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మూడు ఉన్నాయి.

Updated Date - Apr 30 , 2024 | 11:00 PM