Share News

Kids Sleeping: పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా పడుకునేలా ఎలా చెయ్యాలి? పేరెంటింగ్ నిపుణులు చెప్పిన చిట్కాలివీ..!

ABN , Publish Date - May 01 , 2024 | 03:02 PM

పిల్లలు తల్లిదండ్రుల పక్కన పడుకోవడం అనేది మంచి విషయమే అయినా, తల్లిదండ్రులకు అది బాగా అనిపించినా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అది ఎంతమాత్రం మంచిది కాదు.. ప్రయాణాలు చేయ్యాల్సి వచ్చినప్పుడో, తల్లిదండ్రులు దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడో.. పిల్లలు చదువుల కోసం దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు.

Kids Sleeping:  పిల్లలు  తల్లిదండ్రులకు దూరంగా పడుకునేలా ఎలా చెయ్యాలి? పేరెంటింగ్ నిపుణులు చెప్పిన చిట్కాలివీ..!

పిల్లలు పడుకోవడం అంత సులువుగా జరిగే పని కాదు.. తల్లిదండ్రులు కథలు చెప్పి, తిట్టి, ఏమార్చి, ఎన్నెన్నో చేసి పిల్లలను పడుకోబెడుతుంటారు. కొందరు పిల్లలకు తల్లిదండ్రులు పక్కన లేకపోతే నిద్రరాదు. మరికొందరు పిల్లలు తల్లి పక్కన లేకపోతే భయపడతారు. పిల్లలు తల్లిదండ్రుల పక్కన పడుకోవడం అనేది మంచి విషయమే అయినా, తల్లిదండ్రులకు అది బాగా అనిపించినా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అది ఎంతమాత్రం మంచిది కాదు.. ప్రయాణాలు చేయ్యాల్సి వచ్చినప్పుడో, తల్లిదండ్రులు దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడో.. పిల్లలు చదువుల కోసం దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక ఒంటరిగా నిద్రపోవడం నేర్పించాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు. పిల్లలు ఒంటరిగా నిద్రించే అలవాటును ఎలా పెంచవచ్చో తెలుసుకుంటే..

పిల్లలను ఒక్కసారిగా ఒంటరిగా పడుకోమని తల్లిదండ్రులు బలవంతం చేయకూడదు. పిల్లలను వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఒంటరిగా పడుకునేలా అలవాటు చేయాలి. పిల్లలు అలా పడుకోవడానికి అలవాటు పడేకొద్దీ రోజుల సంఖ్యను కూడా పెంచవచ్చు. ఇలా చేస్తే పిల్లలు తమకు తాము ఒంటరిగా నిద్రపోవాలనే విషయానికి అలవాటు పడతారు.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!


పిల్లలు నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవడం, నైట్ డ్రెస్ , లైట్లు డిమ్ చేయడం, పడుకునే ముందు ప్రార్థన చేయడం లేదా మంచి పుస్తకం చదవడం వంటి అలవాట్లు చేయాలి. ఇది పిల్లలు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

పిల్లలు తల్లిదండ్రులతో చాలా అటాచ్మెంట్ గా ఉంటారు. అలాంటి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు పక్కన లేకపోయినా కనీసం వారికి సంబంధించిన వస్తువులు అయినా తమతో ఉండాలని అనుకుంటారు. కనీసం అలా అయినా పిల్లలు తమకు తాము పడుకునేలా అలవాటు చెయ్యాలి.

పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి అలవాటు పడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏడుస్తూ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయచ్చు. తల్లిదండ్రులను తన దగ్గరే పడుకోమని అడగవచ్చు. ఇలాంటి సందర్భాలలో పిల్లలను వారి గదికి తీసుకెళ్లి వారు పడుకునే వరకు అక్కడే ఉండి తర్వాత అక్కడి నుండి వెళ్లిపోవాలి.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 01 , 2024 | 03:02 PM