ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ

ABN, Publish Date - May 01 , 2024 | 12:26 PM

ప.గో. జిల్లా: చింతలపూడి లిఫ్ట్‌ ఆపింది ముమ్మూటికీ సీఎం జగనేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మంగళవారం వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. జగన్‌ కుల కక్ష వల్లే చింతలపూడి లిఫ్ట్‌ను ఆపేశారని, అమరావతిని కట్టలేదని.. చింతలపూడిని కట్టనివ్వలేదని.. కొన్ని కులాలకు లబ్ధి చేకూరుతుందనే జగన్‌ ఇదంతా చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌కు ఓటేసి గెలిపిస్తే మనకు వారసత్వంగా వచ్చే భూములుండవని అన్నారు. పాస్‌ పుస్తకాలపైన, సరిహద్దు రాళ్లపైన జగన్‌ బొమ్మ ఎందుకు.. మన ఆస్తుల ఒరిజినల్స్‌ వారి వద్ద ఉంటాయట.. మన ఆడ పిల్లలకు ఆస్తి పత్రాల కింద జిరాక్స్‌లు ఇవ్వాలట.. ఈ జిరాక్స్‌ పత్రాలతో ఏ బ్యాంకు వాడైనా, వడ్డీ వ్యాపారియైనా మనకు అవసరానికి అప్పు ఇస్తాడా ?.. ఐదేళ్లకే ఇంత విధ్వంసం మరో ఐదేళ్లు భరించలేమని.. కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 1/6

పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం పర్యటనకు వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌పై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తున్న దృశ్యం.

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 2/6

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధక్షుకుడు పవన్ కల్యాణ్ పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెంలో వారాహి విజయభేరి సభలో ప్రసంగిస్తున్న దృశ్యం. ప్రక్కన కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు..

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 3/6

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్‌తోపాటు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ తదితరులను చూడవచ్చు.

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 4/6

కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌‌ను పరిచయం చేస్తూ.. ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పవన్ కల్యాణ్..

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 5/6

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధక్షుకుడు పవన్ కల్యాణ్ పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ప్రసంగిస్తున్న కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు..

ప.గో.జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ 6/6

పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ నిర్వహించిన వారాహి విజయభేరి సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Updated at - May 01 , 2024 | 12:26 PM