Share News

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

ABN , Publish Date - May 02 , 2024 | 03:12 PM

వేడి అధికంగా ఉన్నప్పుడు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రాలు చల్లని గాలికి ఆరుబయట ఉండేట్టుగా చూసుకోవాలి. కాస్త శరీరం చల్లబడిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో చెమట ద్వారా పెరుకున్న బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది.

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!
Summer Skin

వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి, చెమట కాయలు మామూలే.. చెమట తెచ్చే చికాకుతో అస్తమానూ చర్మం చిరాకుగా ఉంటుంది. దానితో పాటు దురద, దద్దుర్లు, జిడ్డు మామూలుగా ఉండే సమస్యలు. చెమట పొక్కులు సహజంగా అందరిలోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటితో వచ్చే చికాకును వదిలించుకోవాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించక తప్పదు.

వదులుగా ఉండే దుస్తులు ధరించండి..

వేడి వల్ల ఏర్పడిన దద్దుర్లు తగ్గాలంటే ఎండ వేడికి చెమటను పీల్చే విధంగా కాటన్ వస్త్రాలను, వదులుగా ఉండే వాటిని ధరించాలి. పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ వస్త్రాలను ధరించండ చికాకును కలిగిస్తుంది. అందుకే వీటిని తగ్గించుకోవడం మంచిది. దీనితో దద్దుర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

హైడ్రేటెడ్‌గా ఉంటే..

వేడి దద్దుర్లకు ప్రధాన కారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. దీనితో చెమట అధికంగా ఉంటుంది. శరీరం వేడెక్కినప్పుడు చల్లబరచడానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థితిలో శరీరానికి నీటిని అందించకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ చెమట వేడి దద్దుర్లు కలిగిస్తుంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి దాహం అనిపించకపోయినా ఎండ సమయాల్లో నీటిని అధికంగా తీసుకోవడం మంచిది. అలాగే అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల హైడ్రేటింగ్ గా ఉంచుతాయి.


Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

వేడి అధికంగా ఉన్నప్పుడు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రాలు చల్లని గాలికి ఆరుబయట ఉండేట్టుగా చూసుకోవాలి. కాస్త శరీరం చల్లబడిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో చెమట ద్వారా పెరుకున్న బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది.

టాల్కమ్ పౌడర్...

టాల్కమ్ పౌడర్ చెమటను గ్రహించి, చర్మాన్ని పొడిగా ఉంచడానికి మంచి మార్గంగా ఉంటుంది. చర్మపు మడతల మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. స్నానం తర్వాత ఒంటిని పొడిగా ఉంచాలి. మెడ, తొడలు, ఇతర భాగాల్లో టాల్కమ్ పౌడర్ రాయాలి. ఇది చర్మాన్ని చికాకు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

Eye Health : ఏసిలో ఉండే వారికి ఈ సమస్య తప్పదు.. జర జాగ్రత్త..!

విరామం తీసుకోవడమే..

ఎండలో ఎక్కువ సమయం తిరిగే పనిని వాయిదా వేయండి. ఇది శరీర ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తుంది. అధిక చెమట, వేడి దద్దుర్ుల కారణంగా ఏర్పడతాయి. మరీ తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, తలకు టోపి వంటి వాటిని ధరించడం మంచిది.


పరిస్థితి మరీ అలా ఉంటే..

చెమట,. ఉక్క కారణంగా చెమటకాయలు అధికంగా ఉంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం మంచిది. డాక్టర్ సలహా మేరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 02 , 2024 | 03:12 PM