Share News

Health Tips : వేసవిలో శరీరంలో ఇనుము లోపం సంకేతాలు ఎలా ఉంటాయంటే .. !

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:44 PM

శరీరంలో ఇనుము లోపాన్ని అనీమియా అంటారు. ఇనుము లోపం కారణంగా రక్తహీనత కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఆక్సిజన్ రవాణాలో సహాయపడే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.

Health Tips : వేసవిలో శరీరంలో ఇనుము లోపం సంకేతాలు ఎలా ఉంటాయంటే .. !
Iron deficiency

శరీరంలో ఐరెన్ లోపిస్తే ఇది అనీమియాకు దారితీస్తుంది. ముఖ్యంగా వేసవిలో అయితే కొన్ని సంకేతాల ద్వారా దీనిని తెలుసుకోవచ్చు. వేసవి వేడిలో శరీరం చాలా ఇబ్బందికి గురవుతుంది. ముఖ్యంగా ఐరెన్ లోపం ఏర్పడినప్పుడు ఎక్కువ అలసటగా అనిపించడం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఐరెన్ లోపం ఉన్నవారిలో కనిపించే సాధారణ లోపం అయినప్పటికీ లక్షణాలు వీటికే పరిమితం కాకపోవచ్చు.

శరీరంలో ఇనుము లోపాన్ని అనీమియా అంటారు. ఇనుము లోపం కారణంగా రక్తహీనత కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఆక్సిజన్ రవాణాలో సహాయపడే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.

ముఖ్యమైన లక్షణాలు..

అలసట, బలహీనత

తలనొప్పి

కండరాల తిమ్మిరి

చిరాకు

ఏకాగ్రత తగ్గడం

శ్వాస ఆడకపోవడం

నోటి పుండ్లు

పాలిపోయిన చర్మం

పెళుసుగా ఉండే గోళ్లు

నాలుక రంగు మారడం

Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!


కారణాలు..

1. తినే ఆహారంలో ఐరెన్ లేనివి ఎంచుకోవడం, మాంసం, గుడ్లు, ఆకు కూరలు వంటివి తీసుకోవాలి. రక్తంలో ఐరన్ ఉంటుంది.

2. రక్తాన్ని కోల్పోతే శరీరంలో మొత్తం ఇనుము కంటెంట్ తగ్గుతుంది.

3. అధిక బుుతు స్రావం వల్ల స్త్రీలలో అనీమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భం సమయంలో కూడా ఐరన్ లోపం స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

4. ఇనుము లోపం కారణంగా చర్మం, జుట్టులో మార్పులు కనిపిస్తాయి. ఐరన్ లోపం కారణంగా జుట్టు రాలిపోతుంది. అలాగే చర్మం పొడిబారినట్టుగా తయారవుతుంది.

ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!

5. నోటి పూత కూడా ఉంటుంది. నోటి మూలల్లో పగుళ్లు, నోటి పూత, నోటిలో మంట, పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి.

6. గుండె దడ వంటి ఇబ్బంది ఇనుము లోపంతో కలుగుతుంది. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల చర్మం ఎరుపు రంగును కోల్పోతుంది.


వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?

7. కనురెప్పలు, గోర్లు పోలిపోయినట్లు కనిపిస్తాయి. మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పుకోవచ్చు.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 30 , 2024 | 01:44 PM