Share News

Delhi: డీప్‌ఫేక్‌ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో ‘పిల్‌’

ABN , Publish Date - May 02 , 2024 | 04:23 AM

రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్‌’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Delhi: డీప్‌ఫేక్‌ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో ‘పిల్‌’

న్యూఢిల్లీ, మే 1(ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్‌’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్‌లో కోరింది.


సీనియర్‌ న్యాయవాది జయంత్‌ మెహతా బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌సింగ్‌ అరోరాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ గురించి ప్రస్తావించారు. డీప్‌ఫేక్‌ వీడియోలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ స్పందించలేదన్నారు. ఎన్నికల వేళ చక్కర్లు కొడుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషన్‌ సక్రమంగా ఉంటే గురువారం విచారణ చేపడతామని తెలిపింది.

Updated Date - May 02 , 2024 | 04:23 AM