Share News

Mumbai: సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో.. కస్టడీలోని నిందితుడి ఆత్మహత్య

ABN , Publish Date - May 02 , 2024 | 04:29 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద ఇటీవలే కాల్పులకు పాల్పడిన ఘటనలో పలువురిని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Mumbai: సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో.. కస్టడీలోని నిందితుడి ఆత్మహత్య

ముంబై, మే 1: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద ఇటీవలే కాల్పులకు పాల్పడిన ఘటనలో పలువురిని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు అనూజ్‌ తపన్‌(32) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.


టాయిలెట్‌లోని కిటికీకి బెడ్‌షీట్‌తో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబైలోని సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద గత నెల 14న కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులకు ఆయుధాలను సరఫరా చేసిన కారణంగా తపన్‌ను అరెస్టు చేశారు.

Updated Date - May 03 , 2024 | 06:56 AM