Share News

Accident: హైవేపై ఢీకొన్న కారు, ట్రక్కు.. 10 మంది మృతి

ABN , Publish Date - Apr 17 , 2024 | 06:56 PM

ఎక్స్‌ప్రెస్‌ హైవేపై అత్యంత వేగంగా వెళ్తున్న కార్(car), ముందు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌(truck)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(accident). దీంతో కారులో ఉన్న 10 మంది మృత్యువాత చెందారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Accident: హైవేపై ఢీకొన్న కారు, ట్రక్కు.. 10 మంది మృతి
car accident Ahmedabad Vadodara Expressway

ఎక్స్‌ప్రెస్‌ హైవేపై అత్యంత వేగంగా వెళ్తున్న కార్(car), ముందు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌(truck)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(accident). దీంతో కారులో ఉన్న 10 మంది మృత్యువాత చెందారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటన గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్‌-వడోదర(Ahmedabad Vadodara) ఎక్స్‌ప్రెస్‌ హైవేపై(Expressway) బుధవారం చోటుచేసుకుంది.

కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఈ ప్రమాదం(accident) జరిగింది. ప్రమాదానికి గురైన కారు నంబరు GJ 27 EC 2578 అని, ఇది అహ్మదాబాద్‌కు చెందిన కిరణ్ గిరీష్‌భాయ్ భట్ పేరు మీద నమోదైందని అధికారులు అన్నారు. ఈ ప్రమాదం కారణంగా కారు ముందు భాగం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.


అయితే ప్రమాద సమయంలో కారు అతివేగంతో వచ్చినట్లు స్థానికులు చెప్పారని పోలీసులు(police) వెల్లడించారు. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్‌ కారును అదుపు చేయలేక ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు అన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్‌కు చెందిన రెండు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ఆ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.


ఇది కూడా చూడండి:

Hyderabad: వ్యాధులు నయం చేస్తామని మోసం.. ఆయుర్వేద ఔషధాల ముఠా అరెస్ట్‌


UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి


మరిన్ని క్రైం వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 07:03 PM