Share News

తనిఖీల్లో రూ.2.07 లక్షలు స్వాధీనం

ABN , Publish Date - May 01 , 2024 | 12:55 AM

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎన్నికల స్పెషల్‌ టీంలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా రూ.2,07,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కైకలూరు రూరల్‌ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.

తనిఖీల్లో  రూ.2.07 లక్షలు స్వాధీనం

కైకలూరు, ఏప్రిల్‌ 30: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎన్నికల స్పెషల్‌ టీంలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా రూ.2,07,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కైకలూరు రూరల్‌ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఎన్నికల ప్రత్యేక టీంలు ఈ తనిఖీలు నిర్వహించాయి. కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి చెందిన పెన్మెత్స వెంకట రామకృష్ణంరాజు రూ.2,07,000లు నగదును కారులో తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదును ఆక్వా చెరువులకు ఖర్చులు నిమిత్తం తీసుకువెళుతున్నట్లు రైతు పేర్కొన్నాడు. అయితే సంబంధిత ధ్రువీకరణపత్రాలు అందజేయాలని రైతుకు సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదును కైకలూరు రిటర్నింగ్‌ అధికారి కె. భాస్కర్‌కు అప్పగించారు.

లక్ష పాంఫ్లెట్లు స్వాధీనం

కైకలూరు, ఏప్రిల్‌ 30: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన లక్ష పాంప్లెట్‌లను సీజ్‌ చేసినట్లు కైకలూరు రూరల్‌ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. మంగళవారం కైకలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు అయిన ఉప్పుటేరు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధన మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి పలు రాజకీయ పార్టీలకు చెందిన లక్ష పాంప్లెట్లను గుర్తించి సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేలుకు మించి నగదు తీసుకు వెళ్తే ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నేరమని ఆ నగదును సీజ్‌ చేసి కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు.

Updated Date - May 01 , 2024 | 12:55 AM