Share News

అ అధికారులపై చర్యలు తీసుకోండి : లోకాయుక్త ఆదేశం

ABN , Publish Date - May 02 , 2024 | 01:09 AM

ఏలూరు నగర పాలక సంస్థలో 2021లో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా 17 ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే నిబంధనలు పాటించకుండా, రిజర్వేషన్ల విధానం అమలు చేయకుండా ఉద్యో గాలు భర్తీ చేశారని, లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి.

అ అధికారులపై చర్యలు తీసుకోండి : లోకాయుక్త ఆదేశం

ఏలూరు టూటౌన్‌, మే 1 : ఏలూరు నగర పాలక సంస్థలో 2021లో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా 17 ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే నిబంధనలు పాటించకుండా, రిజర్వేషన్ల విధానం అమలు చేయకుండా ఉద్యో గాలు భర్తీ చేశారని, లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని కార్మిక నాయకుడైన జి.సునీల్‌కుమార్‌ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త విచారణలో అడ్డగోలుగా నియామకాలు చేపట్టారని స్పష్టం చేసింది. అప్పటి నగర పాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌, పర్యవేక్షకులు షేక్‌ సిరాజూద్దీన్‌, కేఎస్‌ఎన్‌.మూర్తి, జూనియర్‌ అసిస్టెంట్‌ మాణిక్యాలరావులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు భర్తీ చేయడంలో కొందరు వైసీపీ నాయకుల పాత్ర ఉందనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - May 02 , 2024 | 01:09 AM