Share News

కొల్లేరు కాంటూరు కుదిస్తా

ABN , Publish Date - May 01 , 2024 | 12:59 AM

‘కొల్లేరు ప్రజల చిరకాల కోరిక కాంటూరును కుదిస్తాం. కొల్లేరు అభయార ణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు కేంద్రంతో మాట్లాడి పూర్తిచేస్తా’నని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

కొల్లేరు కాంటూరు కుదిస్తా
దెందులూరు సభలో మాట్లాడుతున్న చంద్రబాబు..

చంద్రబాబుకు ఘన స్వాగతం.. రోడ్‌ షో అదుర్స్‌.. కిటకిటలాడిన దెందులూరు

పెదవేగి/ దెందులూరు, ఏప్రిల్‌ 30 : ‘కొల్లేరు ప్రజల చిరకాల కోరిక కాంటూరును కుదిస్తాం. కొల్లేరు అభయార ణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు కేంద్రంతో మాట్లాడి పూర్తిచేస్తా’నని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. దెందులూరులో సోమవారం ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌లతో కలసి ప్రజాగళం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆక్వా రైతుల బాధలు తెలుసు. ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్‌ను అందిస్తా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేస్తాను. ఐదేళ్లుగా రాయితీలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. బిందుసేద్యానికి 90శాతం రాయితీపై పరికరాలు అందిస్తాం. పామాయిల్‌ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే తండ్రీ, కొడుకులు వసూళ్లకు తెరలేపారు. పోలవరం కుడి కాల్వ గట్లను దోచేశారు. గట్టు కొట్టేయడంతో భవిష్యత్‌లో వరద ప్రమాదం పొంచి ఉంది. పోలవరం గట్లు కొట్టిన వారిని జైల్లో పెట్టినా తప్పు లేదు. దెందులూరును దందాల ఊరుగా మార్చేశారు. దాడులు, దౌర్జన్యాల సంస్కృతికి తెరలేపారు. ఎర్రిపప్ప తన కొడుకును ఎంపీ అభ్యర్థిగా పంపించాడు. ఓటర్లు ఆయనను ఎర్రిపప్పను చేసి పంపించండి. ఎంపీ, ఎమ్మెల్యేలతో పనులు చేయించే బాధ్యత నాది.. ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీది.. లండన్‌బాబు వచ్చాడు.. ఐటీ కంపెనీలు తెస్తాడని అంతా ఎదురు చూశారు.. కానీ ఒక్క కంపెనీ అయినా తెచ్చాడా..? పేకాట కంపెనీని మాత్రం తీసుకొచ్చాడు. మీ ఈలలు ఓట్లుగా మారాలి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించు కుంటే ప్రజల సంక్షేమం సాధ్యపడుతుంది’ అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. చింతమనేని మాట్లాడుతూ తనను నమ్మి రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు మళ్లీ చంద్రబాబు నాకు అవకాశం కల్పించారని, మళ్లీ గెలిపించాలని కోరారు. నియోజక వర్గ్గంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పోలవరం కాల్వ ద్వారా రెండు లిఫ్టులను ఏర్పాటు చేసి అందించాలన్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో కృష్ణ కాల్వలో వస్తున్న మురుగు వ్యర్థాలను తాగునీరుగా అందిం చాల్సిన పరిస్థితి ఉందనడంతో స్పందించిన చంద్రబాబు మనం అధికారంలోకి రాగానే రెండు లిఫ్ట్‌లను మంజూరు చేస్తామన్నారు.

రోడ్‌ షోకు విశేష స్పందన

సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం రోడ్‌ షోకు చంద్రబాబు దెందులూరు రావాల్సి ఉండగా నాలుగు గంటల 53 నిమిషాలకు హెలీకాఫ్టర్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్‌లో ప్రజాగళం రోడ్‌ షో వద్దకు 4:59కి చేరుకు న్నారు. 5:02 గంటలకు ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద ప్రచార సభలో 5:45 గంటల వరకు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్డు షోకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు మద్దతు తెలిపారు. దీనిపై చం ద్రబాబు మాట్లాడుతూ జిల్లాల వారీగా మాదిగ, మాల సోదరులకు ఇబ్బందులు లేకుండా వారి సమస్య పరిష్కరి స్తానన్నారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు, ఘంటశాల వెంకటలక్ష్మి, కొఠారు ఆదిశేషు, సంబంగి వేణుగోపాలతిలక్‌, మాగంటి నారాయణప్రసాద్‌, తోట ఏసమ్మ, పెనుబోయిన శేషారత్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:59 AM