Share News

నారాయణపురంలో ‘జనంలోకి ధర్మరాజు’

ABN , Publish Date - May 02 , 2024 | 12:53 AM

ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించిన వారే నిజమైన ప్రజా సేవకులని ఉంగుటూరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు.

నారాయణపురంలో ‘జనంలోకి ధర్మరాజు’
నారాయణపురం ఎన్నికల ప్రచారంలో గన్ని, పత్సమట్ల కూటమి నేతలు

ఉంగుటూరు, మే 1 : ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించిన వారే నిజమైన ప్రజా సేవకులని ఉంగుటూరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం నారాయణపురంలో ‘జనంలోకి ధర్మరాజు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ శరణాల మాలతీరాణితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారాయణపురం సర్పంచి దిడ్ల అలకనంద, నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త వట్టి పవన్‌కుమార్‌, నియోజకవర్గ పరిశీలకులు పోతుల అన్నవరం, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రరావు, అడపా శోభారాణి, ఆశీర్వాదం, మాజీ సర్పంచి ఎ.నాగమణి, కడియాల రవిశంకర్‌, ఇమ్మణ్ణి గంగాధరరావు, గోలి శ్రీనివాసరావు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

జనసేనలో చేరికలు

ఉంగుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో బుఽధవారం పలు గ్రామాల నాయకులు జనసేనలో చేరారు. రావులపర్రుకు చెందిన దండ్రు రమేష్‌, మండల పాస్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, బాదంపూడికి చెందిన లేగల మురళీకృష్ణ మరి కొంతమంది మహిళలతో కలిసి పార్టీలో చేరారు. నియోజకవర్గ పరిశీలకుడు వట్టి పవన్‌కుమార్‌తో కలిసి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు.

Updated Date - May 02 , 2024 | 12:53 AM