Share News

మండే ఎండలో జగన్‌ మంటలు

ABN , Publish Date - May 02 , 2024 | 01:08 AM

రోజూ చెప్పే మాటలే ఇక్కడా చెబుతున్నాడు. ఎండలో నిల బడి వినే బదులు ఇంటికి వెళ్లి టీవీ చూసుకోవచ్చు పద.. అంటూ చాలా మంది సీఎం జగన్‌ సభ నుంచి తిరుగుముఖం పట్టారు.

మండే ఎండలో   జగన్‌ మంటలు
ఎండ వేడికి తట్టుకోలేక ఇలా పెట్రోలు బంకులో నీడకు చేరిన మహిళలు

ఏలూరులో మధ్యాహ్నం సీఎం సభ

ఎండతో మలమలమాడిన జనం

ఏలూరు/ఏలూరు రూరల్‌, మే 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘రోజూ చెప్పే మాటలే ఇక్కడా చెబుతున్నాడు. ఎండలో నిల బడి వినే బదులు ఇంటికి వెళ్లి టీవీ చూసుకోవచ్చు పద’ అంటూ చాలా మంది సీఎం జగన్‌ సభ నుంచి తిరుగుముఖం పట్టారు. ఏలూరులో బుధవారం 36 నిమిషాలపాటు సాగిన సీఎం జగన్‌ ప్రసంగం ప్రజలను మెప్పించలేకపోయింది. ‘సిద్ధమా ఏలూరు.. మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కూడా మీ బిడ్డను ఆశీర్వదించటానికి ఇక్కడకు వచ్చిన మీకు అందరికి కృతజ్ఞతలు’ అంటూ ప్రసంగం ప్రారంభం కాగానే చాలా మం ది మహిళలు, యువకులు సభాస్థలి నుంచి వెనక్కి వెళ్లడం ప్రారంభించారు. ఏలూరులో బుధవారం జరిగిన సీఎం జగన్‌ ప్రచార సభ అతి సామాన్యులను, వైసీపీ శ్రేణుల్లో నిరాశ మిగి ల్చింది. ఆయన రోజూ చెప్పే మాటలే ఇక్కడ చెప్పడం, ఉప న్యాసానికే పరిమి తమవడంతోపాటు ప్రభుత్వ విజయాలకంటే చంద్రబాబుపై విమర్శలకే అధిక సమయం తీసుకోవడంతో ప్రజలు, వైసీపీ శ్రేణులు పెదవి విరిచారు. సీఎం సభ కోసం ఎంపిక చేసిన ప్రాంతం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఏ రాజకీయ పార్టీ సభ జరిగినా నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేయడం పరిపాటి. ఆ కూడ లి విశాలంగా ఉంటుంది. నాలుగు వైపుల వున్న ప్రజలు మాట్లాడేవారు కనిపిస్తూ అనుకూలంగా ఉండేది. అయితే బుధవారం అందుకు భిన్నంగా ఫైర్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో కోర్టు సెంటర్‌ రోడ్డులో ప్రసంగం చేయడంతో గంద రగోళం ఏర్పడింది. అలవాటు ప్రకారం చాలా మంది రోడ్డు మధ్యనే నిలబడిపోయారు. రోడ్డు డివైడర్‌కు ఒక వైపు పూర్తిగా సీఎం కాన్వాయ్‌ వాహనాలకు రిజర్వు చేయడంతో సభ ఏర్పా టు చేసిన రోడ్డుకు సగానికి కూడా జనం రాలేదు. ఫైర్‌ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోనే వాహనాలన్ని ఆపేయడంతో జనం విసుగు ప్రదర్శించారు. షాపులు మొత్తం మూయించ డంతో వారంతా ఆవేదనకు గురయ్యారు. ఫైర్‌స్టేషన్‌ నుంచి రాకపోకలు నిషేధించడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పాతబస్టాండ్‌ వద్దే రెండు గంటలు నిలిపివేయడంతో బస్సులు లేక ప్రయాణికులు వేచి ఉన్నారు. ఎర్రటి ఎండలో తమను అనవసరంగా నడిపిస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఏర్పాటుపై వైసీపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేశారు. దీనికితోడు మధ్యాహ్నం విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంత వాసులు అల్లాడిపోయారు. ఇక ఏలూరు ఫైర్‌స్టేషన్‌ మీదుగా వెళ్లాల్సిన వాహనాల ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దారి మళ్లించారు.

ఆకట్టుకోని సీఎం ప్రసంగం

సీఎం జగన్‌ ప్రసంగం జనాన్ని మెప్పించలేకపోయింది. ఆయన మాట్లాడిన ప్రసంగం మొత్తం బటన్‌ నొక్కడం, వివిధ సంక్షేమ పథకాల పేర్లు పదేపదే వల్లి వేయటానికే సరిపెట్టా రు. కనీసం రాష్ట్రంలో ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశామని ఒక్కటి చెప్పలేదు. రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పడానికి ఒక్క అభివృద్ధి పేరు తలచలేదు. ఎంతసేపు మీ బిడ్డ బిడ్డ అంటూ బటన్‌ నొక్కుడు పథకాలతోనే ప్రసంగాన్ని నింపివే శారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును విమర్శించ టానికి ప్రయత్నించారు. జగన్‌ మాట్లాడుతూ వచ్చే రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం మొదలవుతుందని, పేదలకు చంద్రబాబు మోసాలకు యుద్ధం ప్రారంభమైందన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి చెప్పుకోవడా నికి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళిక నమ్మి మోస పోవద్దని, అది చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఆపేస్తాడన్నారు. వైసీపీ పథకాలు ఉండాలో వద్దో, అందాలో ప్రజలే నిర్ణయించు కోవాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ నాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను ప్రజలకు పరిచయం చేసి గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు జనసమీకరణలో కూడా అనుకున్న స్థాయిలో ప్రయత్నాలు చేయలేదు.

రేపు సీఎం జగన్‌ నరసాపురం రాక

నరసాపురం : సీఎం జగన్‌ శుక్రవారం ఉదయం పది గంటలకు నరసాపురంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. టేలర్‌ హైస్కూల్‌ మైదానంలో హెలిక్టాపర్‌ దిగి ఆక్కడ నుంచి నేరుగా మెయిన్‌రోడ్‌కు చేరుకుని మాట్లాడతారు.

Updated Date - May 02 , 2024 | 01:08 AM