Share News

సీఎం వచ్చారుగా..

ABN , Publish Date - May 02 , 2024 | 12:39 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనతో బుధవారం ఏలూరు ప్రజలు నరకంచూశారు. అసలే మండుతున్న ఎండలు. ఆపై ప్రధాన రహదారులు మూసి వేయడంతో జనం ఎటు వెళ్లాలో తెలియక నానా అవస్థలు పడ్డారు.

సీఎం వచ్చారుగా..
ఏలూరులో ప్రధాన రహదారిని మూసివేయడంతో ప్రజల అవస్థలు

నరకం చూసిన ఏలూరు ప్రజలు

ఏలూరు క్రైం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనతో బుధవారం ఏలూరు ప్రజలు నరకంచూశారు. అసలే మండుతున్న ఎండలు. ఆపై ప్రధాన రహదారులు మూసి వేయడంతో జనం ఎటు వెళ్లాలో తెలియక నానా అవస్థలు పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి, కోర్టు ఉన్న ప్రధాన రహదారి పైనే రోడ్‌షో ఉండడంతో ఉదయం 11 గంటల నుంచే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్ళేవారు కూడా నరకయాతన పడ్డారు. నగరానికి వచ్చే బస్సులు కూడా వేరే మార్గాల్లో పంపించారు. వ్యాపారులు షాపులను మూసుకోవాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనాలు, కార్లతో ఆసుపత్రిలో హారన్స్‌ వేసుకుంటూ చక్కెర్లు కొట్టారు. రోగులకు తీవ్ర ఇబ్బందులు కలి గించారు. వైసీపీ కార్యకర్తలు ఆకతాయిలుగా మారారు. వాటర్‌ ప్యాకెట్లను చింపి ఆ నీళ్ళను మహిళలపై చిమ్మారు. జేబుదొంగలు జనం పర్సులు,సెల్‌ఫోన్లు కొట్టేశారు. ఆర్‌ఆర్‌ పేటలో పార్కింగ్‌ చేసిన ఒక మోటారు సైకిల్‌ను కూడా ఎత్తుకు పోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన సాయంత్రం 6 గంటల వరకూ నగరంలోని ప్రజలు నరకయాతన చూడాల్సి వచ్చింది.

Updated Date - May 02 , 2024 | 12:40 AM