Share News

వార్‌ వన్‌సైడ్‌!

ABN , Publish Date - May 02 , 2024 | 12:30 AM

జిల్లాలో రాజకీయాలు పదునెక్కాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నువ్వా నేనా అంటూ ప్రజాక్షేత్రంలో పోటీ పడుతున్నారు.

వార్‌ వన్‌సైడ్‌!

కూటమికి కలిసి వస్తున్న మూడు పార్టీల సహకారం

కూటమి వర్సెస్‌ వైసీపీ ఎవరి వ్యూహాలు వారివి..

జిల్లాలో పదునెక్కిన రాజకీయం

కొద్ది రోజుల క్రితం వైసీపీకి అనుకూలంగా జిల్లాలో పందేలు.. ఇప్పుడంతా గప్‌చుప్‌

సంక్షేమం.. అభివృద్ధి బాటలో కూటమి

డబ్బులతో వైసీపీ ఎత్తుగడలు

జిల్లాలో రాజకీయాలు పదునెక్కాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నువ్వా నేనా అంటూ ప్రజాక్షేత్రంలో పోటీ పడుతున్నారు. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచారం హోరెత్తుతోంది. టీడీపీ–జనసేన– బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తూ దూసుకువెళుతోంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తోంది. వార్‌ వన్‌సైడ్‌ అంటూ హోరెత్తిస్తోంది. ఈ కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు, కేడర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐదేళ్లు అరాచక, విధ్వంసక పాలనతోపాటు స్థానికంగా అభివృద్ధి లేకపోవడంతో జనంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు అధికార పార్టీకి అనుకూలంగా పందేలు సాగగా, ఇప్పుడు అంతా గప్‌చుప్‌గా వుంది. ఎవరూ ఆ వైపు మాట్లాడడం లేదు. ఇదే ఆ పార్టీ అభ్యర్థులను కలవరపరుస్తోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరంలో ఒక్కటైన కూటమి

భీమవరంలో వైసీపీ వ్యూహం తొలి నుంచి బెడిసికొడు తోంది. పవన్‌ కల్యాణ్‌ భీమవరంలో పోటీ చేస్తారంటూ ఇక్కడ అంతా భావించారు. అదే జరిగితే వైసీపీయే ఆర్థిక భారం సహా అన్ని రకాల సహకారం అందిస్తుందని స్థానిక పార్టీ నేతలు ఊహించారు. వైసీపీ అభ్యర్థి అదే ధీమాలో ఉన్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ను ఢీకొట్టాం. ఇప్పుడు అదే తరహాలో నెగ్గుకు రాగలమన్న ధీమా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌లో ఉండేది. ఇప్పుడు అనూహ్యంగా జనసేన నుంచి అంజిబాబు రంగంలోకి దిగారు. అంజిబాబుకు పదేళ్లపాటు భీమవరం నియో జకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అభివృద్ధి పనులు నిర్వహించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీ తంగా సేవలందిస్తూ వచ్చారు. కూటమి నాయకులంతా అక్కడ ఒక్కట య్యారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ అంజిబాబు మంచివాడన్న అభిప్రాయం ఉంది. టీడీపీకి బీసీలు అండగా ఉంటున్నారు. జనసేనకు మరో బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. రెండూ కలిస్తే భారీ గెలుపు తమదేనన్న వ్యూహంతో కూటమి అడుగులు వేస్తోంది. అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా వైసీపీ భీమవరంలో పావులు కదుపు తోంది. గ్లాస్‌కు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెబుతూ, మరోవైపు సొమ్ములను ఎరవేసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. వారు ఏం చేసినా గెలుపు తమదేనన్న ధీమాతో అంజిబాబు ముందుకు సాగుతున్నారు.

పాలకొల్లు ఎవరికి సొంతం

పాలకొల్లులో వైసీపీ తొలి నుంచి పిల్లి మొగ్గలు వేస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది. చివరి దశలో గుడాల గోపీని రంగంలోకి దింపింది. అదే సామాజిక వర్గంపై ఇప్పుడు ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు మూడోసారి విజయం సాధించేందదుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యూహాలు పన్నుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఐదేళ్లపాటు ప్రజా సమస్య లపై పోరాడుతూ వచ్చారు. వైసీపీ హయాంలో నియోజ కవర్గంలో అభివృద్ధి లేకపోవడం, టిడ్కో ఇళ్లు మంజూరు చేయకపోవడం వంటి అంశాలను జనంలోకి తీసుకువెళు తున్నారు. కులాలకు అతీతంగా మద్దతును కూడగట్టు కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబా టులో ఉండడం ఈసారి ఆయనకు కలసి వచ్చే అంశంగా పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.

జూ నర్సాపురంలో కలిసిన చేతులు

నర్సాపురంలో కాపు, మత్స్య కార సామాజిక వర్గం ఓటర్లు అధికం. ఆ రెండు ఏకపక్షమైతే కూటమి అభ్యర్థి నాయకర్‌ గెలుపు నల్లేరుపై నడకగా అంతా భావిస్తున్నా రు. కూటమికి అండగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారా యుడు ఇప్పుడు క్రియాశీలకమ య్యారు. వీరితోపాటు తెలుగుదేశం ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు కూటమికి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇవన్నీ కూటమికి అనుకూలంగా ఉన్న పరిణామాలే. కూటమి అభ్యర్థికి అండగా ఉన్న రెండు సామాజిక వర్గాల ఓట్లను చీల్చే ప్రణాళికతో అధికార పార్టీ ఉంది. ఆ దిశగానే వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌రాజు పావులు కదుపుతున్నారు. అర్ధ బలంతోనైనా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో వైసీపీ నిమగ్నమైంది. నియోజకవర్గంలో ఐదేళ్లపాటు అభివృద్ధి లేకపోవడంతో అక్కడ వైసీపీకి మైనస్‌గా మారింది.

తాడేపల్లిగూడెంలో రసవత్తరం

తాడేపల్లిగూడెంలో పోరు రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు మాటలతో రాజకీయాన్ని వేడిక్కిస్తున్నారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రచారంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టిని టార్గెట్‌ చేస్తున్నారు. కూటమిని గెలిపిస్తే రౌడీయిజం పెరిగిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి దీటుగా కూటమి నాయకులు స్పందిస్తూ టీడీపీ హయాంలో రౌడీయిజం సాగిందా..? అభి వృద్ధి సాగిందా..? అంటూ నిల దీస్తున్నారు. ఐదేళ్లలో నియోజక వర్గంలో సాగిన దందాలు, అక్రమ వసూళ్లు, అవినీతి పర్వాన్ని బొలిశెట్టికి అండగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి ఎండగడుతున్నారు. మళ్లీ వైసీపీకి అధికారమిస్తే ఇప్పుడు కొండంతవున్న అవినీతి కొన్ని రెట్లు పెరిగిపోతుందంటూ వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గురిపెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు గతంలో వైసీపీ వెంట నడిచిన నాయకులు అనేక మంది ఇప్పుడు కూటమి పక్షాన చేరిపోయారు. ఇవన్నీ కూటమిని గెలిపిస్తాయన్న ధీమాతో నాయకులు ముందుకు సాగుతున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:30 AM