Share News

స్థానిక సమస్యల సంగతేంటి?

ABN , Publish Date - May 02 , 2024 | 12:01 AM

ముఖ్యమంత్రి హోదాలో.. అది కూడా ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారంటే స్థానికంగా అభివృద్ధి సాధించేందుకు ఏవైనా హామీలు ఇస్తారని సగటు ఓటరు ఆశించడం సహజం.

స్థానిక సమస్యల సంగతేంటి?
పారాది వంతెన దుస్థితి

- కొత్త హామీలు లేవు

- గత హామీల ప్రగతి ఏమిటో చెప్పలేదు

- మూతపడిన పరిశ్రమలు... కార్మికుల పరిస్థితి ఏమిటి?

- ఇదీ సీఎం ‘సిద్ధం’ సమావేశం తీరు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/బొబ్బిలి

ముఖ్యమంత్రి హోదాలో.. అది కూడా ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారంటే స్థానికంగా అభివృద్ధి సాధించేందుకు ఏవైనా హామీలు ఇస్తారని సగటు ఓటరు ఆశించడం సహజం. కానీ బుధవారం సీఎం జగన్‌ చేపట్టిన సిద్ధం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక సమస్యల ప్రస్తావనే లేదు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు... పాదయాత్ర నాటి హామీలు... ముఖ్యమంత్రిగా ఇ చ్చిన హామీలు... గత ఐదేళ్ల లో అవి ఏ మేరకు నెరవే ర్చారు? అనే ప్రస్తావనే లేదు. ఇదేదీ లేకుండా ప్రతిపక్షాలపై విరుచుకు పడేందుకే ఎక్కువ స మయం తీసుకున్నారు. ప్రతిపక్షాల పైన.. వారి ఎన్నికల హామీల పైన విమ ర్శలకే ఎక్కువ సమయం తీ సుకున్నారు. వైసీపీ ప్రస్తుత ఎన్నికల హామీలు ఏమిటో ప్రస్తావించలేదు. సంక్షేమ పథ కాలన్నీ కొనసాగిస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కిన అంశాన్నే మరీ మరీ చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు ఏమిటి ? ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికంగా ఉపయోగపడే వనరులు ఏమిటి? వాటిని ఎలా వినియోగించుకోవాలని అనుకుంటు న్నారు? తాము చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి ఏమిటి? అన్న విషయాలను కనీసం ప్రస్తావించలేదు.

బిల్లులు చెల్లించక...

బిల్లులు చెల్లించని కారణంగా విజయనగ రం, మన్యం జిల్లాల పరిధిలో అనేక అభివృద్ధి ప నులు నిలిచిపోయాయి. చినబోగిలి-మక్కువ, మక్కువ-సాలూరు రోడ్ల విస్తరణ పనులు బిల్లులు కాక నిలిచిపోయాయి. ప్రజల రాకపోకల కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. సీతానగరం- బొబ్బిలి మధ్య ప్రవహిస్తున్న సువర్ణముఖి నది వంతెన పనులు కూడా బిల్లులు చెల్లించని కార ణంగానే నిలిచిపోయాయి.

- తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పెండింగ్‌ పిల్ల కాల్వ పనులు నిలిచాయి.

- గజపతినగరం బ్రాంచి కాల్వ పనులను ప్రభుత్వం ఒక్క అడుగు కూడా పూర్తి చేయలేదు.

- తారకరామతీర్థ సాగర్‌ సాగునీటి ప్రాజెక్టు పనులు జరగటం లేదు. చిన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పరిస్థితి. తోట పల్లి కుడి ప్రధాన కాల్వ పరిధిలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తామ ని ఎమ్మెల్యే శంబంగి హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు. బొబ్బిలి మండలంలోని చిన్న సాగునీటి వనరులు... కురుపాం మండలంలోని గుమ్మిడి గెడ్డ, కొమరాడ మండలంలోని వనకాబడి గెడ్డ, పార్వతీపురం మండలంలోని అడారుగెడ్డ, మక్కువ మండలంలో సురాపాడు, సాలూరు, రామభద్రపురం, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల పరిధిలోని చిన్న సాగునీటి వనరులను వినియోగించుకునే మినీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టలేదు. సీఎం ప్రసంగంలో వీటి ప్రస్తావన కూడా లేదు.

పరిశ్రమల ఊసేదీ?

బొబ్బిలి ప్రాంతంతో పాటు జిల్లాలో మూత పడిన ఫెర్రో పరిశ్రమల అంశాన్ని ప్రస్తావించలేదు. జూట్‌ పరిశ్రమల్లో పనిచేసి ఉపాధి కోల్పో యిన కార్మికుల ఊసే లేదు. కార్మిక దినోత్సవం రోజున కార్మిక సమస్య లను ప్రస్తావించకపోవటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే పరిశ్రమలు మూతపడి... కార్మికులు ఉపాధి కోల్పోయారు. బొబ్బిలి ప్రాంతంలోని ఎన్‌సీఎస్‌ చక్కెర కార్మాగారాన్ని మూత వేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. రైతుల చెరకు సరఫరా బకాయిల కోసం ఏకంగా కర్మాగారాన్నే మూత వేయించారు. బకాయిలు పూర్తిగా చెల్లించారా అంటే అదీ లేదు. కొంత మంది నాయకుల స్వార్థం కోసం ఫ్యాక్టరీ బలైందన్న విమర్శలున్నాయి. మరో వైపు రైతులు చెరకు పంటకు దూరమయ్యారు.

Updated Date - May 02 , 2024 | 12:01 AM