Share News

ఇలా.. ఇలా.. ఇలా

ABN , Publish Date - May 01 , 2024 | 11:44 PM

బొబ్బిలి పట్టణంలో సీఎం జగన్‌ బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనాలను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బిగ్గరగా గొంతెత్తి అరవడంతో సీఎం ఏమి చెబుతున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆయన ప్రసంగం సాగిన తీరు ఇలా ఉంది.

ఇలా.. ఇలా.. ఇలా

ఇలా.. ఇలా.. ఇలా

విసిగించిన సీఎం జగన్‌ ప్రసంగం

చంద్రబాబుపై విమర్శలు చేస్తూ గాలిలో చేతులు ఊపాలని పిలుపు

బొబ్బిలి, మే 1:

బొబ్బిలి పట్టణంలో సీఎం జగన్‌ బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనాలను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బిగ్గరగా గొంతెత్తి అరవడంతో సీఎం ఏమి చెబుతున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆయన ప్రసంగం సాగిన తీరు ఇలా ఉంది. బొబ్బిలీ....అని పిలిచి సిద్ధమా...అని చాలా బిగ్గరగా అడిగారు. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాలు సృష్టించాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వస్తే పథకాలన్నీ రద్దవుతాయన్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తానే కదా లీడర్‌ అంటూ జనాన్ని అడిగారు. పథకాలన్నింటినీ మళ్లీ మళ్లీ వల్లెవేసి ఆలోచన చేయండని కోరారు. చంద్రబాబు హయాంలో ఏమీ జరగలేదని చెబుతూ ఇలా... ఇలా... ఇలా... అని చేయి ఊపండి అంటూ జగన్‌ సభలో చేసి చూపించారు. పదే పదే సీఎం పెద్ద గొంతుతో ఇలా అనడం గమనార్హం. 2014 లో కూటమి తరపున ఇచ్చిన మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకోండి అంటూ ఆ మేనిఫెస్టో పత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పుడేమో సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటున్నారని ఎద్దేవాచేశారు. 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీలను గెలిపించండి. ఒక్కటీ కూడా తగ్గేది లేదు అంటూ జనాలకు సీలింగ్‌ ఫ్యాన్‌ను చూపించారు. సీఎం వెంట మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బెల్లాన చంద్రశేఖర్‌, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు, సీనియర్‌ నేత తూముల భాస్కరరావు తదితరులు ఉన్నారు.

=======

Updated Date - May 01 , 2024 | 11:44 PM