Share News

కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్‌వో

ABN , Publish Date - May 02 , 2024 | 12:09 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన కె.విజయపార్వతి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్‌వో

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన కె.విజయపార్వతి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా విధులు నిర్వహించిన బగాది జగన్నాథరావు మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన విజయపార్వతి.. ప్రస్తుతం సీతంపేట డిప్యూటీ డీఎంహెవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహన్‌ ఉన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:09 AM