Share News

రావాడలో జీడి తోటలు దగ్ధం

ABN , Publish Date - May 02 , 2024 | 12:07 AM

తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామ సమీపం లో జీడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి.

రావాడలో జీడి తోటలు దగ్ధం

జియ్యమ్మవలస: తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామ సమీపం లో జీడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. బుధవారం ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా ఒక్కసారిగా అగ్ని దావాణంలా వ్యాపించింది. ఈ ప్రమాదంలో చినమేరంగి గ్రామానికి చెందిన కౌలు రైతు మీసాల బుల్లిబాబుకు సంబంధించిన 2.10 ఎకరాల జీడి తోట పూర్తిగా కాలి పోగా, రావాడ గ్రామానికి చెందిన మర్రి పారమ్మ, దత్తి శ్రీనులకు చెందిన మరో రెండు ఎకరాలు జీడి తోటలు పాక్షికంగా కాలిపోయాయి. వెంటనే స్పందించిన సర్పంచ్‌ సింగారపు రవణమ్మ వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. గుమ్మలక్ష్మీపురం అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. లేదంటే ఆ చుట్టు పక్కన ఉన్న వందలాది ఎకరాల జీడి, మామిడి తోటలు పూర్తిగా కాలిబూడిదయ్యేవి. దీంతో మిగిలిన జీడి మామిడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:07 AM