Share News

నేడు జిల్లాకు బాలకృష్ణ

ABN , Publish Date - May 01 , 2024 | 11:45 PM

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా పర్యటనకు వస్తున్నారు. తొలుత చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రానికి గురువారం చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

నేడు జిల్లాకు బాలకృష్ణ

నేడు జిల్లాకు బాలకృష్ణ

చీపురుపల్లి, విజయనగరంలో ఎన్నికల ప్రచారం

విజయనగరం, మే 1(ఆంధ్రజ్యోతి)/ చీపురుపల్లి: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా పర్యటనకు వస్తున్నారు. తొలుత చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రానికి గురువారం చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గంటస్తంభం కూడలిలో రోడ్డు షో ఉంటుంది. చీపురుపల్లిలో సాయంత్రం 4గంటల వరకు ప్రచారం కొనసాగించి ఆపై విజయనగరం చేరుకుంటారు. టీడీపీ శ్రేణులు విజయగనరంలోని నీళ్ల ట్యాంక్‌ వద్ద బాలకృష్ణకు స్వాగతం పలకనున్నాయి. నీళ్లట్యాంక్‌, కొత్తపేట, అంబటి సత్రం కూడలి, మూడు లాంతర్ల రోడ్డు మీదుగా గంటస్తంభం కూడలికి చేరుకుంటారు. రోడ్‌ షోలో ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొంటారు.

Updated Date - May 01 , 2024 | 11:45 PM