Share News

కూటమి విజయం ఖాయం: జగదీశ్వరి

ABN , Publish Date - May 02 , 2024 | 12:04 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కురపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు.

కూటమి విజయం ఖాయం: జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కురపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. ఆమె బుధవారం విలేకర్లతో మాట్లాడారు. దేశంలో పలు సర్వేలు అందించిన నివేదికల ప్రకారం 150 పైగా సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కురు పాంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌ అభివృద్ధిపై మ్యానిఫెస్టోలో పెట్టడం చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు నియోజకవర్గంపై ఉన్న మమకారం అర్థమవుతుందన్నారు.

ఇరిడి పంచాయతీలోని గాజులగూడ, జొల్లగూడ, కొత్తగూడ, కనయ్యగూడ, కోసిగిభద్ర, టెంకసింగి, గుణద, డోకులగూడలో ఆమె ప్రచారం చేశారు. ప్రచారంలో కూటమి నాయకులు బిడ్డిక పద్మావతి, పాడి సుదర్శనరా వు, కె.మల్లేశ్వరరావు, మండంగి భూషణరావు, చంద్రమౌళి, గుణాపురం జగన్నాథం, లక్ష్మణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఇరిడి, డుమ్మంగి తదితర పంచాయతీల్లో కూటమి అభ్యర్థి జగదీశ్వరి బుధవారం ప్రచారం నిర్వహించారు. కూటమి అధినేతలు నరేంద్రమోడీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.

గరుగుబిల్లి: టీడీపీ మండల అధ్యక్షుడు అక్కేన మధుసూదనరావు తన స్వగ్రామమైన నాగూరులో బుధ వారం సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు ఎం.పురుషోత్తంనాయుడు, మరడాన తవిటినాయుడు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, అంబటి తవిటినాయుడు, ఎంబీ విజయ వాంకుశం, తదితరులు పాల్గొన్నారు.

కురుపాం: కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జి.శివడ పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు కోలా రంజిత్‌కుమార్‌, జీవీ రమణమూర్తి, చందక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొమరాడ: మండలంలో గుణదతీలేసు పంచాయతీ లాబేసు గ్రామానికి చెందిన పది కుటుంబాలు బుధవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీ మండల కన్వీనర్‌ ఎస్‌.ఉదయశేఖర్‌పాత్రుడు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ యూనిట్‌ ఇన్‌చార్జి హిమరిక బలరాం, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:04 AM