Share News

మన్యంలో సెగలు

ABN , Publish Date - May 02 , 2024 | 01:08 AM

ఏజెన్సీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం అత్యధికంగా కొయ్యూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది. వేడి, ఉక్కపోతకు జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళలో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

మన్యంలో సెగలు
ఎండ తీవ్రతకు జనసంచారం లేని కొయ్యూరు మండలం కాకరపాడు జంక్షన్‌

- అత్యధికంగా కొయ్యూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

పాడేరు, మే 1(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం అత్యధికంగా కొయ్యూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది. వేడి, ఉక్కపోతకు జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళలో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..

కొయ్యూరులో బుధవారం 41.1, పాడేరులో 40.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో 38.7, హుకుంపేటలో 38.2, పెదబయలులో 38.0, అరకులోయ, డుంబ్రిగుడలో 37.9, చింతపల్లిలో 37.7, ముంచంగిపుట్టులో 37.3, అనంతగిరిలో 37.2, జీకేవీధిలో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండలంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. కొయ్యూరులో బుధవారం ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపించింది. మధ్యాహ్నం వేళలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే డౌనూరు, కాకరపాడు ప్రధాన జంక్షన్లు సైతం జనసంచారం లేక బోసిపోయాయి.

ఎండల పట్ల అప్రమత్తం

పాడేరు మే 1(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రత, వడగాడ్పులు వీస్తున్నాయని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగవద్దని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - May 02 , 2024 | 01:08 AM