Share News

నగరానికి బాలకృష్ణ

ABN , Publish Date - May 02 , 2024 | 01:28 AM

ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నగరానికి విచ్చేశారు.

నగరానికి బాలకృష్ణ

నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం

గోపాలపట్నం, మే 1:

ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నగరానికి విచ్చేశారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ చేరుకున్న బాలకృష్ణకు టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి, ఆయన అల్లుడు ఎం.శ్రీభరత్‌, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నగరంలోకి వెళ్లారు. బాలకృష్ణ గురువారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్ర లేదా శనివారాల్లో నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నట్టు సమాచారం.

Updated Date - May 02 , 2024 | 01:28 AM