Share News

ఆ ఓటును కవరులో భద్రపరుస్తారు

ABN , Publish Date - May 01 , 2024 | 11:44 PM

ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించే పదం టెండర్‌ ఓటు. దీనినే చాలెంజ్‌ ఓటు అని కూడా అంటారు. అర్హుడైన వ్యక్తి ఓటును ఇతరులు వేయడం, దొంగ ఓటు లేక ఇతర కారణాలతో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఎదురైతే తిరిగి దానిని పొందేందుకు ఎన్నికల సంఘం 1961లో సెక్షన్‌ 49 (పి)ద్వారా ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ విధానంలో ఓటు ఓటు పొందాలనుకునే వారు ముందుగా ఎన్నికల అధికారిని కలిసి ఓటు కోల్పోయిన వ్యక్తి తానేనని నిరూపించుకోవాలి. దీనికోసం ఓటరు కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్టు చూపించాలి. ఎన్నికల అధికారి ఇచ్చే ఫారం 17(బి) పూర్తిచేసి టెండర్‌ బ్యాలెట్‌ పొందాలి. ప్రత్యేక కవరులో ఈ ఓటును భద్రపరచి కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్‌ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును టెండర్‌/చాలెంజ్‌ ఓటు అంటారు.

 ఆ ఓటును కవరులో భద్రపరుస్తారు

గార: ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించే పదం టెండర్‌ ఓటు. దీనినే చాలెంజ్‌ ఓటు అని కూడా అంటారు. అర్హుడైన వ్యక్తి ఓటును ఇతరులు వేయడం, దొంగ ఓటు లేక ఇతర కారణాలతో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఎదురైతే తిరిగి దానిని పొందేందుకు ఎన్నికల సంఘం 1961లో సెక్షన్‌ 49 (పి)ద్వారా ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ విధానంలో ఓటు ఓటు పొందాలనుకునే వారు ముందుగా ఎన్నికల అధికారిని కలిసి ఓటు కోల్పోయిన వ్యక్తి తానేనని నిరూపించుకోవాలి. దీనికోసం ఓటరు కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్టు చూపించాలి. ఎన్నికల అధికారి ఇచ్చే ఫారం 17(బి) పూర్తిచేసి టెండర్‌ బ్యాలెట్‌ పొందాలి. ప్రత్యేక కవరులో ఈ ఓటును భద్రపరచి కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్‌ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును టెండర్‌/చాలెంజ్‌ ఓటు అంటారు.

Updated Date - May 01 , 2024 | 11:44 PM