Share News

అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఆమోదయోగ్యం : అచ్చెన్న

ABN , Publish Date - May 01 , 2024 | 11:39 PM

ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫేస్టో అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఆమోదయోగ్యం : అచ్చెన్న
సంతబొమ్మాళి: టీడీపీలో చేరిన ముస్లిం నేతలతో అచ్చెన్నాయుడు

టెక్కలి: ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫేస్టో అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు మేనిఫెస్టోను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి బుధవారం జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌తో కలిసి పరశురాంపురంలో పాలభిషేకం చేశారు. రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్‌ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, నేతలు మట్ట సుందరమ్మ, పంగ తవిటయ్య, పంగ వసంత్‌, శ్యామ్‌, మక్క శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను ఆదు కుంటామని ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో భావన పాడు, గెద్దలపాడు, ఉమిలాడ, మరువాడ, లక్కివలస, సున్నాపల్లి, పాతమేఘవరం, శ్రీజగన్నాథపురం తదితర గ్రామాల నుంచి మత్స్యకారులు వచ్చి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పుక్కళ్ల శ్రీనివాస్‌, దానేసు, ధనరాజ్‌, చంటి, రాజులు పాల్గొన్నారు.
టెక్కలి/సంత బొమ్మాళి: నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం పలు గ్రామాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి అచ్చెన్నాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో కోటబొమ్మాళి మండలం కురుడు నుంచి 20 కుటుంబాలు, రామయ్యపేట నుంచి పది, నంది గాం మండలం బడగాం నుంచి పది, సంతబొమ్మాళి మండలం శ్రీకృష్ణాపురం నుంచి 25, బోరుభద్ర నుంచి 20, సూరాడ వానిపేట నుంచి 20, గొదలాం నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Updated Date - May 01 , 2024 | 11:39 PM