Share News

వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీలోకి చేరిక

ABN , Publish Date - May 01 , 2024 | 11:42 PM

కృష్ణాపురానికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీ, బీజేపీల్లో చేరాయి.

వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీలోకి చేరిక
ఎన్‌డీఏ కూటమిలో చేరిన వైసీపీ నాయకులతో బీజేపీ అభ్యర్థి ఎన్‌ఈఆర్‌

రణస్థలం: కృష్ణాపురానికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీ, బీజేపీల్లో చేరాయి. గ్రామానికి చెందిన గొర్లె అప్పలనాయుడు, నడుపూరి రామారావు, ఎన్‌.రామప్పడు, ఎన్‌.చిన్న, ఎన్‌. అప్పలనాయుడు, గొర్లె కూర్మినాయడు, గొర్లె రామి నాయడుతో పాటు మరో 15 కుంటుంబాలు వైసీపీ ని వీడి ముల్లు కృష్ణ, ఎన్‌.శ్రీను ఆధ్యర్యంలో టీడీపీ, బీజేపీల్లో చేరగా వీరికి కూటమి ఎచ్చెర్ల అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే గొర్లెపేటకు చెందిన మాజీ జడ్పీటీసీ మహంతి సత్యంనాయుడు, ఎం.ప్రసాద్‌, ఎం.కృష్ణంనాయుడుతో పాటు మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. అనంతరం కృష్ణాపురం, గొర్లెపేట, మహంతిపాలెంలో ఆత్మీయ సమా వేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఈఆర్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి తాగునీరు సదు పాయం కల్పిస్తానని, ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఇంటి వద్దే కొళాయిలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు లంక ప్రభ, డీజీఎం ఆనందరావు, గొర్లె లక్ష్మణరావు, పిషిని జగన్నాఽథంనాయుడు, లంక కృష్ణ, ముక్కు ఆది నారాయణ, గొర్లె సాయి తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో టీడీపీ, జనసేన అధి నేతలు చంద్ర బాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు కూటమి నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. కూటమి అభ్యర్థులు నడుకుదిటి ఈశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడులను గెలిపించాలని బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, బెండు మల్లేశ్వరరావు, వావిలిపల్లి రామకృష్ణ, గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మేనిఫెస్టోతో అభివృద్ధి, సంక్షేమం: బగ్గు
జలుమూరు, (సారవకోట):
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమం ఇమిడి ఉందని నరసన్నపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. మదనాపురం, చంద్రయ్యపేట, జాలారి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. గడచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరు సైకిలు గుర్తుపై ఓటువేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, పలువురు నేతలు పాల్గొన్నారు.
నరసన్నపేట: టీడీపీ హయాంలోనే నరసన్నపేట పట్టణం అభివృద్ధి జరిగిందని ఉమ్మడి పార్టీల అభ్యర్ధి బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం స్థానిక బండివీధిలో వైసీపీ డాక్టర్స్‌ సెల్‌ ఉపాఽధ్యక్షుడు ముద్డాడ బాలభూపాల నాయుడు, రఘుపతి నాయుడు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సంద ర్భంగా వారికి రమణ మూర్తి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శిమ్మ చంద్ర శేఖర్‌, నేతలు కింజరాపు రామారావు, గొద్దు చిట్టిబాబు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
యువత భవిష్యత్‌ను వైసీపీ నాశనం చేసింది: శంకర్‌
అరసవల్లి:
రాష్ట్రంలో యువత భవిష్యత్‌ను గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, వారి శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసిందని శ్రీకాకుళం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఎన్టీఆర్‌ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ నేతృత్వంలో యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, మెగా డీఎస్సీపైనే సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, రామ్మోహన్‌ నాయుడును ఎంపీగా గెలి పించాలని కోరారు. సమావేశంలో పెద్ద ఎత్తున యువత, అభిమానులు పాల్గొన్నారు.
ఒక్క అని ప్రజలు అవకాశం ఇస్తే జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడని, మరో ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. బుధవారం నగరంలోని 19వ డివిజన్‌ కెల్ల వీధిలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రకటించిన ఉమ్మ డి మేనిఫెస్టో అమలు ద్వారా రాష్ట్రంలో మరలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతా యన్నారు. అనంతరం డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ముని సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, మాజీ కౌన్సిలర్‌ కెల్ల కొండలరావు, నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, కెల్ల రాజేష్‌, కిషోర్‌కుమార్‌ , పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:42 PM