Share News

నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఉండేది కాదు

ABN , Publish Date - May 01 , 2024 | 11:46 PM

రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు పొందే అవకాశం కల్పించింది. కుల, మత, వర్గ, లింగ, ధనిక, పేద, ప్రాంతాల కతీతంగా అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటిష్‌ పాలనా కాలంలో కేవలం ప్రభుత్వోద్యోగులు, చదవడం, రాయడం వచ్చినవారు, భూస్వాములు, బ్రిటిష్‌ ఏలుబడిలో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఓటుహక్కును కల్పించే వారు. ప్రధానంగా నిరక్షరాస్యులకు అసలు ఓటుహక్కు ఉండేది కాదు. దేశంలో 1952లో జరిగిన మొదటిసారి సాధారణ ఎన్నికల నుంచి అర్హులందరికీ ఓటుహక్కు కల్పించారు. 1952, 1957ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా పోలింగ్‌ పెట్టెలను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఈ డబ్బాలో ఓటు వేసే వారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఒకే డబ్బాను కేటాయించి అందులో ఓటు వేసే విధానం అమల్లోకి తీసుకువచ్చారు.1962 నుంచి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అందరు అభ్యర్థులకు కలిపి ఒకే డబ్బాను ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పత్రాలతో ఓటువేసే విధానం నుంచి నేడు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలను వినియోగించే వరకూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.

నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఉండేది కాదు

హిరమండలం: రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు పొందే అవకాశం కల్పించింది. కుల, మత, వర్గ, లింగ, ధనిక, పేద, ప్రాంతాల కతీతంగా అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటిష్‌ పాలనా కాలంలో కేవలం ప్రభుత్వోద్యోగులు, చదవడం, రాయడం వచ్చినవారు, భూస్వాములు, బ్రిటిష్‌ ఏలుబడిలో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఓటుహక్కును కల్పించే వారు. ప్రధానంగా నిరక్షరాస్యులకు అసలు ఓటుహక్కు ఉండేది కాదు. దేశంలో 1952లో జరిగిన మొదటిసారి సాధారణ ఎన్నికల నుంచి అర్హులందరికీ ఓటుహక్కు కల్పించారు. 1952, 1957ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా పోలింగ్‌ పెట్టెలను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఈ డబ్బాలో ఓటు వేసే వారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఒకే డబ్బాను కేటాయించి అందులో ఓటు వేసే విధానం అమల్లోకి తీసుకువచ్చారు.1962 నుంచి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అందరు అభ్యర్థులకు కలిపి ఒకే డబ్బాను ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పత్రాలతో ఓటువేసే విధానం నుంచి నేడు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలను వినియోగించే వరకూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.

Updated Date - May 01 , 2024 | 11:46 PM