Share News

పోటీ చేయడమంటే..ఆయనకు సరదా

ABN , Publish Date - May 01 , 2024 | 11:50 PM

ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన గుడివాడ కుప్పయ్యకు గెలుపోటములతో సంబంధం ఉండేది కాదు. ఆర్థిక భారమైనా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకో సరదా. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి ఎన్నికలో పోటీ చేసేందుకు ముందుకొచ్చేవాడు. 2009, 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి నామినేషన్‌ వేశాడు. గతఎన్నికలో (2019)లో పోటీచేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాను నమ్ముకున్న బీఎస్పీ జనసేనకు మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించాడు. కొన్నాళ్లు చిలకపాలెంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొవిడ్‌తో మూడేళ్ల కిందట ఆయన మృతి చెందాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనిపించకపోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. అలాగే లావేరు మండలానికి చెందిన గుడివాడ అప్పారావు కూడా 1999 ఎన్నికల వరకూ మూడు నాలుగు సార్లు ఇదే నియోజకవవర్గం నుంచి పోటీచేశారు.

పోటీ చేయడమంటే..ఆయనకు సరదా

రణస్థలం: ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన గుడివాడ కుప్పయ్యకు గెలుపోటములతో సంబంధం ఉండేది కాదు. ఆర్థిక భారమైనా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకో సరదా. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి ఎన్నికలో పోటీ చేసేందుకు ముందుకొచ్చేవాడు. 2009, 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి నామినేషన్‌ వేశాడు. గతఎన్నికలో (2019)లో పోటీచేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాను నమ్ముకున్న బీఎస్పీ జనసేనకు మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించాడు. కొన్నాళ్లు చిలకపాలెంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొవిడ్‌తో మూడేళ్ల కిందట ఆయన మృతి చెందాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనిపించకపోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. అలాగే లావేరు మండలానికి చెందిన గుడివాడ అప్పారావు కూడా 1999 ఎన్నికల వరకూ మూడు నాలుగు సార్లు ఇదే నియోజకవవర్గం నుంచి పోటీచేశారు.

గుడివాడ కుప్పయ్య (ఫైల్‌)

Updated Date - May 01 , 2024 | 11:50 PM