Share News

అభ్యర్థులూ.. ఆరోగ్యం పదిలం

ABN , Publish Date - May 01 , 2024 | 11:45 PM

వేసవి ప్రారంభం నుంచీ ఈ ఏడాది భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తి పోతున్నారు. ప్రతిరోజూ 40 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రత నమోదవుతోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనాలు భయపడుతున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. దీంతో పోటీలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. అయితే, వారిని ఎండలు ఆందోళనకు గురిచేసున్నాయి. ఉదయం పది గంటలు దాటితే ఎండలు మండిపోతుండడంతో ప్రచారానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జా గ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

అభ్యర్థులూ.. ఆరోగ్యం పదిలం

(హరిపురం)

ఫ ఉదయం అభ్యర్థులు, మద్దతుదారులు అల్పాహారం తీసుకొని ప్రచారానికి వెళ్లాలి. ఖాళీ కడుపుతో ప్రచారంలో పాల్గొనరాదు. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటలు, సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచారం చేయాలి. వీలైనంతవరకు ఎండలో తిరగరాదు.

ఫ వాతావరణం చల్లగ ఉన్న సమయంలోనే ఇంటింటా ప్రచారం చేయాలి. ఎండలో ప్రచారం చేయడం తప్పనిసరైతే గొడుగులు వెంట తీసుకెళ్లాలి. అభ్యర్థులు, అనుచరులు తప్పకుండా గొడుగు, టోపీలను విధిగా ధరించి ఎండనుంచి ఉపశమనం పొందాలి.

ఫ ప్రచారం సమయంలో ఎక్కడైనా చెట్ల కింద లేదా భవనాల వద్ద సేదతీరాలి. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రచారంలో దిగాలి. చెమట రూపంలో లవణాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. తమ వెంట నీళ్ల సీసాలు ఉంచుకోవాలి. ఓఆర్‌ఎల్‌, గ్లూకోజ్‌ వంటివి వెంట ఉంచుకోవాలి.

ఫ మజ్జిగ తాగడం, కర్బూజ తీసుకోవడంతో ఉష్ణ తాపం నుంచి ఉపశ మనం లభిస్తుంది. అంబలి, పళ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తిని, ఉత్సాహాన్నిస్తాయి.

ఫ బయట శీతల పానీయాలు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగవద్దు. చల్లదనంకోసం ఐస్‌క్రీములు తినవద్దు. మాంసం, వేపుడు కూరలు, నూనె పదార్ధాలు తీసుకోకపోవడం మంచిది. మాంసకృత్తులు తీసుకోవడం వల్ల శరీరాన్ని నిస్సత్తువను చేసి ప్రచారంలో అలసటను తెస్తుంది. సాధ్యమైనంత వరకు శాఖాహారం తీసుకోవాలి.

ఫ మద్యం, ధూమపానం మానేయడం ఆరోగ్యానికి మంచిది. కాఫీలు, టీలు కూడా తాగకపోవడం ఉత్తమం.

ఫ రాత్రివేళ ఆహారం తక్కువగా తేసుకుంటే ఉదయం ఉత్సాహంగా ఉంటారు.

ఫ వేసవిలో కలుషిత నీరు, కలుషిత ఆహారంతో అతిసారం, కామెర్లు, టైఫాయిడ్‌, వడదెబ్బ తదితర జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

ఫ కాచిచల్లార్చిన నీటిని వడకట్టి తాగాలి. నీటిని శుభ్రపరచడానికి బిందెడు నీటిలో ఒక క్లోరిన్‌ బిళ్లను వేసి అరగంట తర్వాత తాగాలి.

ఫ మల, మూత్ర విసర్జనల అనంతరం, భోజనానికి మందు తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

ఫ నిమ్మరసంలో ఉప్పు మిశ్రమాన్ని కలిపి తాగాలి.

ఫ ఎండలో తిరగడం వల్ల తొందరగా అలిసిపోవడంతో పాటు విరో చనాలు అవుతాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి.

Updated Date - May 01 , 2024 | 11:45 PM