Share News

అప్పట్లో రాజకీయల్లో విలువలు ఉండేవి

ABN , Publish Date - May 01 , 2024 | 11:49 PM

నాకు అరవై దశకంలో ఓటుహక్కు వచ్చింది. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పించేవారు. ఆనాటి రాజకీయాల్లో విలువలు ఉండేవి. ఓట్లకోసం నాయకులు ఇంటింటికి కాలినడకన వచ్చేవారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరి తరువాత ఒకరు వచ్చేవారు. పోటీదారులు మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉండేది. నాయకులు ప్రజలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయల్లో అవినీతి ఎక్కు వైంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. నాయకులు కూడా ఆ విధంగా తయారయ్యారు. అక్షరాస్యత పెరిగింది.. అలాగే అవినీతి కూడా రాజకీయాల్లో పెరిగింది. ఎన్నికల డ్యూటీలకు సరదాగా వెళ్లేవాళ్లం. ప్రస్తుతం ఎన్నికల డ్యూటీ చేయాలంటే ఉద్యోగులు భయపడు తున్నారు.

అప్పట్లో రాజకీయల్లో విలువలు ఉండేవి

నరసన్నపేట: నాకు అరవై దశకంలో ఓటుహక్కు వచ్చింది. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పించేవారు. ఆనాటి రాజకీయాల్లో విలువలు ఉండేవి. ఓట్లకోసం నాయకులు ఇంటింటికి కాలినడకన వచ్చేవారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరి తరువాత ఒకరు వచ్చేవారు. పోటీదారులు మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉండేది. నాయకులు ప్రజలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయల్లో అవినీతి ఎక్కు వైంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. నాయకులు కూడా ఆ విధంగా తయారయ్యారు. అక్షరాస్యత పెరిగింది.. అలాగే అవినీతి కూడా రాజకీయాల్లో పెరిగింది. ఎన్నికల డ్యూటీలకు సరదాగా వెళ్లేవాళ్లం. ప్రస్తుతం ఎన్నికల డ్యూటీ చేయాలంటే ఉద్యోగులు భయపడు తున్నారు.

-కింతలి వెంకట సత్యనారాయణ, రిటైర్డు డిగ్రీకళాశాల అధ్యాపకులు, నరసన్నపేట

Updated Date - May 01 , 2024 | 11:49 PM