Share News

మన రాష్ట్రం కోసం మేము సైతం

ABN , Publish Date - May 02 , 2024 | 12:22 AM

ఐదేళ్లలో అంధకారంలోకి వెళ్లిన రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు ఐటీ ప్రొఫెషనల్స్‌ మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఈ మేరకు ఐటీ ప్రొఫెషనల్స్‌ కార్యాచరణ పోస్టర్‌ను టీడీపీ నాయకులు, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.

మన రాష్ట్రం కోసం మేము సైతం
ఐటీ ప్రొఫెషనల్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన బాలకృష్ణ

ఐటీ ప్రొఫెషనల్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన బాలకృష్ణ

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 1 : ఐదేళ్లలో అంధకారంలోకి వెళ్లిన రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు ఐటీ ప్రొఫెషనల్స్‌ మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఈ మేరకు ఐటీ ప్రొఫెషనల్స్‌ కార్యాచరణ పోస్టర్‌ను టీడీపీ నాయకులు, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. స్థానిక కేబీ రెస్టారెంట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రం కోసం ప్రొఫెషనల్స్‌ స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఐటీ ప్రొఫెషనల్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో యువత భవిష్యత్‌ అంధకారంగా మారిందన్నారు. ఉద్యోగాలు లేక, ఉన్నత చదువులు చదువుకుని ఏమి చేయాలో తెలియని దుర్భర పరిస్థితిలో యువత ఉందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఒంగోలు టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపు కోసం టీపీడబ్ల్యూ వింగ్‌ పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్‌ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి బండారు బాబు, సింగమనేని కృష్ణ, కొల్లూరి చందు, సోము, సుధీర్‌, సుమంత్‌, హరికృష్ణ, వేణు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:22 AM