Share News

దామచర్ల కుటుంబం ప్రజాసేవకే అంకితం

ABN , Publish Date - May 02 , 2024 | 12:18 AM

అవినీతి లేకుండా ప్రజా సేవకే అంకితమైన దామచర్ల కుటుంబాన్ని ప్రజలు ఆశీ ర్వదించి గెలిపించాలని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవా రం ఒంగోలు నగరంలోని 34వ డివిజన్‌లో పర్యటించారు.

దామచర్ల కుటుంబం ప్రజాసేవకే అంకితం

టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల

ఒంగోలు(కార్పొరేషన్‌), మే 1: అవినీతి లేకుండా ప్రజా సేవకే అంకితమైన దామచర్ల కుటుంబాన్ని ప్రజలు ఆశీ ర్వదించి గెలిపించాలని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవా రం ఒంగోలు నగరంలోని 34వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ తన తాత ఆం జనేయులు స్ఫూర్తితో రాజకీయాలలో అడుగుపెట్టిన దా మచర్ల కుటుంబం ఎల్లప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుం దన్నారు. తనను 2014 ఎన్నికలో గెలిపించి, ఒంగోలును అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ప్రజలకు మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి, మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తె లుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల సంక్షే మానికి పెద్దపీట వేసిందన్నారు. యువత, మహిళలు, మధ్యతరగతి వారికి, అలాగే బడగు, బలహీన వర్గాల తోపాటు వృద్ధులకు, దివాం్యగుల పింఛను పెంపుచేస్తూ ప్ర జల ముందుకు వచ్చిన టీడీపీని ఆశీర్వదించాలని తెలి పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు నియోజకవర్గానికి రూ.2600 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని చెప్పారు. ఆ తర్వాత ఒక్కఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక్క పనికూడా చేయలేకపోయిందన్నారు. అవినీతి, భూ కబ్జాలు, ఆక్రమణలు, దోచుకోవడం, దాచుకోవడమే ప నిగా వైసీపీ పాలకులు వ్యవహరించారని విమర్శించారు. తనపై నమ్మకముంచి, గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న 3వ నెంబ రుపై నొక్కి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరా రు. ఈ సందర్భంగా డివిజన్‌లోని మహిళలు దామచర్లకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బీజేపీ నాయకులు యోగ య్యయాదవ్‌, టీడీపీ నాయకులు, జీవీఆర్‌, దాయనేని ధర్మ, గొర్రెపాటి రాజేంద్ర, కోలా ప్రభాకర్‌ తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:18 AM