Share News

ఎన్నికల ప్రచారంలో రేషన్‌ డీలర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌

ABN , Publish Date - May 02 , 2024 | 12:24 AM

కొమరోలు మండలంలోని దద్దవాడ పంచాయతీలో బుధవారం జరిగిన వైసీపీ ప్రచారానికి ఆ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కపల్లి డీలర్‌ సీగె సుబ్బరాయుడు, ఫీల్డ్‌ అసిస్టెంటు భూమా రమణయ్యలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో రేషన్‌ డీలర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌
అక్కపల్లిలో వైసీపీ ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణయ్య, పొట్టిపల్లిలో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న రేషన్‌డీలర్‌ సుబ్బారాయుడు

కొమరోలు, మే 1 : మండలంలోని దద్దవాడ పంచాయతీలో బుధవారం జరిగిన వైసీపీ ప్రచారానికి ఆ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కపల్లి డీలర్‌ సీగె సుబ్బరాయుడు, ఫీల్డ్‌ అసిస్టెంటు భూమా రమణయ్యలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని పొట్టిపల్లి గ్రామం లో జరిగిన వైసీపీ అభ్యర్ధి ఎన్నికల ప్రచారంలో డీలర్‌ సీగె సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఇదే పంచాయతీలోని అక్కపల్లి గ్రామంలో దద్దవాడ ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భూమా రమణయ్య ప్రచారంలో పాల్గొనారు. ప్రభుత్వం, ప్రభుత్వ అనుబంధ సంస్ధలకు చెందిన వారు ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల నియమావళిని విస్మరించడమే అని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై టీడీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 12:24 AM