Share News

నిప్పుల కొలిమి

ABN , Publish Date - May 02 , 2024 | 01:26 AM

వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. వడగాడ్పులు ఉధృతమయ్యాయి. రోహిణి కార్తెకు ముందే భానుడు భగభగ మండుతున్నాడు.

నిప్పుల కొలిమి
బుధవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న లాయర్‌పేటలోని ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్‌

మండిన పశ్చిమం

అనేక చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

వెలిగండ్లలో 45.93 నమోదు

అది రాష్ట్రంలోనే రెండో స్థానం

ఉధృతమైన వడగాడ్పులు

మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా రోడ్లు

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 1 :వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. వడగాడ్పులు ఉధృతమయ్యాయి. రోహిణి కార్తెకు ముందే భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. మంగళవారం మరింత మండిపోయింది. వెలిగండ్లలో 45.93 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతల్లో అది రెండో స్థానం. దీంతోపాటు జిల్లాలోని ఎక్కువ మండలాల్లో 45 డిగ్రీల వరకూ ఎండ కాచింది. ఒంగోలులో 40 డిగ్రీలు దాటింది. ఉదయం 10 నుంచే సుర్రుమని పిస్తున్న సూర్యుడు మధ్యాహ్నానికి మంటపుట్టిస్తున్నాడు. దీంతో ప్రజలు గడప దాటి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈలోపు పనులను చక్కబెట్టు కుని ఇళ్లకు చేరుతున్నారు. దీంతో ప్రధాన పట్టణాల్లో రోడ్లు మధ్యాహ్న సమ యంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు వడగాడ్పులు కూడా తోడవడం, ఉక్కపోత అధికమవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

అనేక చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. మాలెపాడులో 45.70, నిప్పట్లపాడు (చీమకుర్తి)లో 45.70, పెద్దబొమ్మలాపురం (దోర్నాల)లో 45.62, అర్వరాయినిపాలెం (కొనకన మిట్ల)లో 45.59, కంభాలపాడు (పొదిలి)లో 45.59, వెస్ట్‌గంగవరం (కురిచేడు)లో 45.50, బోదవాడ (పామూరు)లో 45.50, దర్శిలో 45.49, వెస్ట్‌ కట్టకిందపల్లి(పామూరు)లో 45.40, మేకలవారిపల్లి (తర్లుబాడు) 45.17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సీఎస్‌పురంలో 45.15, కనిగిరిలో 45.09, దేకనకొండ(కురిచేడు)లో 45.0, పొదిలిలో 45.09 డిగ్రీల ఎండ కాచింది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 02 , 2024 | 01:26 AM