Share News

4న దర్శికి చంద్రబాబు

ABN , Publish Date - May 02 , 2024 | 01:24 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 4వతేదీన దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

4న దర్శికి చంద్రబాబు

ఎన్నికల ప్రచార సభకు హాజరు

దర్శి, మే 1: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 4వతేదీన దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వచ్చే శనివారం ఉదయం 9 గంటలకు దర్శిలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌ తెలిపారు. ఈ సభకు అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 02 , 2024 | 01:24 AM