Share News

చంద్రబాబుకు బ్రాహ్మణుల కృతజ్ఞతలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:17 AM

టీడీపీ, జనసేన, బీజేపీ ఉ మ్మడి మేనిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేసి న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా నాయకులు కృ తజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబుకు బ్రాహ్మణుల కృతజ్ఞతలు

ఒంగోలు(కల్చరల్‌), మే 1: టీడీపీ, జనసేన, బీజేపీ ఉ మ్మడి మేనిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేసి న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా నాయకులు కృ తజ్ఞతలు తెలిపారు. బుధవారం ఒంగోలు నగరం లాయర్‌ పేటలోని సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో సమితి రాష్ట్ర కో కన్వీనర్‌ టీవీ.శ్రీ రామమూర్తి మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటా యించి పూర్వవైభవం కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పా రన్నారు. అదేవిధంగా హిందూ దేవాలయాల, సత్రాల ఆ స్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్‌ బోర్డు ఏర్పాటు, ప్రయివేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం, వార్షిక ఆదాయం రూ.50 వేలు పైన ఉన్న దేవాల యాల్లో పనిచేస్తున్న అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంపు, అంతకన్నా తక్కువ ఉన్న వారికి రూ.10 వేలకు పెంపు వంటివి మేనిఫెస్టోలో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ కో ఆర్డినేటర్‌ కామరాజుగడ్డ కుసుమకుమారి మాట్లాడుతూ పురోహితు లు, వంట బ్రాహ్మణులను కులవృత్తిదారులుగా గుర్తిస్తామ ని చెప్పటం ద్వారా వారికి అనేక పథకాలు అందుబా టులోకి వస్తాయన్నారు. తిరుపతి సహా అన్ని దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులో బ్రాహ్మణులకు స్థానం కల్పించనున్నట్లు మే నిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బ్రా హ్మణ అపరకర్మల భవన నిర్మాణం, వేదవిద్యను అభ్య సించిన నిరుద్యోగ యువతకు నెలకు రూ..3 వేలు భృతి ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పొ న్నలూరు శ్రీనివాసఫణి, గంజాం శ్రీరంగనాథ్‌, చీమకుర్తి రా ఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:17 AM