Share News

రేపు ఒంగోలులో బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు

ABN , Publish Date - May 02 , 2024 | 12:15 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు గా రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు ఒంగోలులో జరుగనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమితి నాయకులు బుధవారం తెలిపారు.

 రేపు ఒంగోలులో బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు

హాజరుకానున్న దామచర్ల, మాగుంట

నిర్వహణకు భారీ ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా కదలిరానున్న బ్రాహ్మణులు

ఒంగోలు(కల్చరల్‌), మే 1: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు గా రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు ఒంగోలులో జరుగనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమితి నాయకులు బుధవారం తెలిపారు. స్థానిక కొత్తపేట పోలేరమ్మ గుడి దగ్గర ఉన్న గోల్డ్‌మర్చంట్స్‌ అసోసియేషన్‌లో జరిగే ఈ సదస్సుకు కూటమి ఒంగోలు శాన ససభ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివా సులురెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. అదేవిధంగా సాధికార సమితి రాష్ట్ర నాయకులు సైతం పాల్గొంటారని సమితి నాయకుడు టీవీ.శ్రీరామమూర్తి తె లిపారు. జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు ఈ సదస్సులో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలిపేవిధంగా ప్రసంగాలు, తెలుగుదేశం పార్టీ పాలనలో బ్రాహ్మణ సంక్షేమానికి తీసుకున్న చర్యలు మొదలైన వాటిపై చర్చ ఉంటాయన్నారు. కనుక జి ల్లావ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సదస్సులో పాల్గొనాలని ఆయన కోరారు.

Updated Date - May 02 , 2024 | 12:15 AM