Share News

మద్యం కోసం బారులు

ABN , Publish Date - May 02 , 2024 | 12:25 AM

రాష్ట్రంలో నాణ్యత లేని ‘జే’ బ్రాండ్‌ మద్యం సరఫరాతో ప్రభుత్వాధినేత జగన్‌ లక్షలు గడించాడన్న ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా నాసిరకం బ్రాండ్లు(‘జే’బ్రాండ్‌) మద్యాన్ని ప్రభుత్వం యథేచ్ఛగా సరఫరా చేస్తోంది.

మద్యం కోసం బారులు
మార్కాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

రోడ్లపై వరకు నిల్చుంటున్న మందుబాబులు

మధ్యాహ్నానికే ప్రభుత్వ మద్యం దుకాణాల మూత

బ్లాక్‌ మార్కెట్‌కు ప్రభుత్వ మద్యం

మార్కాపురం, మే 1 : రాష్ట్రంలో నాణ్యత లేని ‘జే’ బ్రాండ్‌ మద్యం సరఫరాతో ప్రభుత్వాధినేత జగన్‌ లక్షలు గడించాడన్న ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా నాసిరకం బ్రాండ్లు(‘జే’బ్రాండ్‌) మద్యాన్ని ప్రభుత్వం యథేచ్ఛగా సరఫరా చేస్తోంది. గత ఏడాదిలో ఏ నెలలో, ఏ షాపులో ఎంత మద్యం విక్రయించారన్న లెక్కల ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఏరోజుకారోజు విక్రయాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు విక్రయిస్తున్నామని ఎస్‌ఈబీ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ మద్యం దుకాణాలో అమ్మకాలు వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయనడం యథార్థం. పేరుకు ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయాలు చేస్తున్నట్లు చూపినప్పటికీ దొడ్డిదారిలో అధికారపార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరాలకు చేరుతున్నాయి. మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది నియామకాలు సైతం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగాయి. దీంతో ఉద్యోగాలు పొందిన సిబ్బంది విధేయత ప్రదర్శి స్తూ చేతివాటం చూపుతున్నారు. నా లుగురాళ్లు వెనకేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు సైతం తమవాటా తాము తీసుకుంటూ మిన్నకుంటున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:25 AM