Share News

వైద్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు

ABN , Publish Date - May 02 , 2024 | 01:25 AM

జిల్లా వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్‌లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌తోపాటు పలువురు ఉద్యోగులు తిరిగి మాతృశాఖకు వెళ్లిపోయారు.

వైద్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు

సూపరింటెండెంట్‌తోపాటు పలువురు ఉద్యోగులు మాతృశాఖకు

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 1 : జిల్లా వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్‌లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌తోపాటు పలువురు ఉద్యోగులు తిరిగి మాతృశాఖకు వెళ్లిపోయారు. వైద్యశాఖకు అనుబంధంగా ఉన్న వివిధ విభాగాలకు చెందిన పలువురు ఉద్యోగులు కొన్నేళ్లుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా వైద్యశాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. అయినా వారు డిప్యుటేషన్‌పై కొనసాగుతూ వచ్చారు. డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈనేపథ్యంలో సూపరింటెండెంట్‌ పయ్యావుల శ్రీనివాసరావు మాతృశాఖ అయిన లెప్రసీ కార్యాలయానికి, ఇతర ఉద్యోగులు వారి శాఖలకు వెళ్లిపోయినట్లు తెలిసింది.

Updated Date - May 02 , 2024 | 01:25 AM