Share News

‘హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి’

ABN , Publish Date - May 02 , 2024 | 12:35 AM

జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు, నిధుల కోసం దూదేకుల కులస్థులు ఐకమత్యంతో పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ బాబన్‌ పిలుపునిచ్చారు.

‘హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి’

డోన్‌(రూరల్‌), మే 1: జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు, నిధుల కోసం దూదేకుల కులస్థులు ఐకమత్యంతో పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ బాబన్‌ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి దూదేకుల ఆత్మీయ సమ్మేళనం క్వాలిటీ రెహిమాన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కింద దూదేకులను పరిగణిస్తూ ప్రభుత్వం వారి హక్కు ల ను అలక్ష్యం చేస్తున్నదని అన్నారు. దూదేకులను గుర్తించే పార్టీలు, న్యాయం చేసే పార్టీలకు మద్దతు పలకాలని కోరారు. నాయకులు క్వాలిటీ అబ్దుల్లా, దస్తగిరి, జాకీర్‌, హుశేన్‌, అక్బర్‌ పాషా, కాశీం, ఖాజా, షేక్షావలి, ఇబ్రహీం, సిద్దిక్‌, మాబాషా, జహరుద్దీన్‌, మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:35 AM